లిక్కర్ కేసులో కవిత నేరం రుజువైంది: సుఖేష్
ABN, Publish Date - Mar 19 , 2024 | 11:04 AM
న్యూఢిల్లీ: కవిత అరెస్టుపై మనీలాండరింగ్ కేసు నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్ స్పందించారు. జైలు నుంచి మరో సంచలన లేఖ విడుదల చేశారు. కవిత అక్కా అని సంబోధిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు.
న్యూఢిల్లీ: కవిత అరెస్టుపై మనీలాండరింగ్ కేసు నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్ స్పందించారు. జైలు నుంచి మరో సంచలన లేఖ విడుదల చేశారు. కవిత అక్కా అని సంబోధిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు. లిక్కర్ కుంభకోణం కేసులో నిజం రుజువైందని అన్నారు. బూటకపు కేసులను రాజకీయ ప్రతీకారం అని, ఇన్నాళ్లు తాను చేసిన వాదన అబద్దమని రుజువైందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ.. వేల కోట్లను సింగపూర్, హాంకాంగ్, జర్మనీలో దాచారని తెలిపారు. నెయ్యి డబ్బాలంటూ చెప్పిన కథలపై దర్యాప్తు జరుగుతోందన్నారు. వేల కోట్లు విదేశాల్లో దాచిన విషయాలన్నీ బయటకు వస్తాయని సుఖష్ అన్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - Mar 19 , 2024 | 11:07 AM