ఢిల్లీని గజగజలాడించిన వ్యక్తి ఎన్టీఆర్..
ABN, Publish Date - Dec 14 , 2024 | 09:56 PM
కూడు, గూడు, గుడ్డ నినాదంతో పాలనకే కొత్త అర్థం తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. దేశంలోనే రాజకీయాల్లో మహిళలకు మెుదటిసారి రిజర్వేషన్లు కల్పించిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు.
విజయవాడ: కూడు, గూడు, గుడ్డ నినాదంతో పాలనకే కొత్త అర్థం తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. దేశంలోనే రాజకీయాల్లో మహిళలకు మెుదటిసారి రిజర్వేషన్లు కల్పించిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. అదే స్ఫూర్తితో తొందర్లోనే మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు వస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. దానికి నాంది పలికిన మహనీయుడు నందమూరి తారక రామారావు అని చెప్పారు. మండల వ్యవస్థ తీసుకొచ్చి పరిపాలనా వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టారని అన్నారు. స్థానిక సంస్థల్లో ప్రత్యక్ష ఎన్నికలకు శ్రీకారం చుట్టారని తెలిపారు. పేదలకు రూ.2లకే కేజీ బియ్యం ప్రవేశపెడితే.. ఇప్పుడు ఫుడ్ సెక్యూరిటీగా దానికి రూపకల్పన చేశారని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టి ఢిల్లీని గజగజలాడించారని అన్నారు. అక్కడ పార్టీని ఓడించి నేషనల్ ఫ్రండ్‌ని అధికారంలోకి తీసుకువచ్చారని సీఎం చంద్రబాబు చెప్పారు.
Updated Date - Dec 14 , 2024 | 09:56 PM