ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సల్మాన్‌ఖాన్‌కు మరో బెదిరింపు కాల్..

ABN, Publish Date - Nov 08 , 2024 | 12:25 PM

ముంబై: బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌కు మరోసారి బెదిరింపు కాల్ వచ్చింది. లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ పేరును ప్రస్తావిస్తూ వచ్చిన సాంగ్‌పై సల్మాన్‌కు బెదిరింపులు వచ్చాయి. ముంబై ట్రాఫిక్‌ కంట్రోల్‌ రూమ్‌కు గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్‌ చేసి హెచ్చరించారు. ఈ పాట రచయిత ఒక నెలలోపు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుదని..

ముంబై: బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌కు మరోసారి బెదిరింపు కాల్ వచ్చింది. లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ పేరును ప్రస్తావిస్తూ వచ్చిన సాంగ్‌పై సల్మాన్‌కు బెదిరింపులు వచ్చాయి. ముంబై ట్రాఫిక్‌ కంట్రోల్‌ రూమ్‌కు గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్‌ చేసి హెచ్చరించారు. ఈ పాట రచయిత ఒక నెలలోపు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుదని.. మరోసారి పాటలు రాయలేనివిధంగా ఉంటుందని గుర్తు తెలియని వ్యక్తులు పేర్కొన్నారు. సల్మాన్‌కు ధైర్యం ఉంటే వారిని రక్షించాలని హెచ్చరించారు. ఈ వ్యక్తులపై వర్లీ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదుచేసినట్లు పోలీసులు తెలిపారు. ఫోన్ చేసిన వ్యక్తుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.


కాగా.. సల్మాన్‌ఖాన్‌కు ఇలా బెదిరింపులు రావడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ పలుమార్లు బిష్ణోయ్‌ గ్యాంగ్‌ నుంచి ఆయనకు బెదిరింపులు వచ్చాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో సల్మాన్‌ నివాసం ఉంటున్న బాంద్రాలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్‌ వద్ద ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఇక అంతకుముందు పన్వేల్ ఫామ్‌హౌస్‌లోకి చొరబడేందుకు కొందరు ప్రయత్నించడం అప్పట్లో కలకలం రేపింది. ఇటీవల సల్మాన్‌కు బెదిరింపులు ఎక్కువైన నేపథ్యంలో కర్ణాటకలోని హవేరిలో ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే రాజస్థాన్‌లో మరో వ్యక్తిని కూడా మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌కు పోలీసులు అప్పగించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.


ఈ వార్తలు కూడా చదవండి..

పసలేని చట్టాలతో సైకోల దాడి నుంచి మహిళలను కాపాడలేం

విద్యుత్ సబ్ స్టేషన్లు ప్రారంభించిన సీఎం చంద్రబాబు

సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం..

గ్రంధి శ్రీనివాస్ నివాసంలో మూడవరోజు ఐటీ సోదాలు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Nov 08 , 2024 | 12:25 PM