ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

4 గ్రాముల డ్రగ్స్‌ సీజ్‌.. యువతి అరెస్టు

ABN, Publish Date - Jan 30 , 2024 | 04:09 AM

: గోవా నుంచి డ్రగ్స్‌ తెప్పించిన ఓ యువతిని సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఆమె ఓ టాలీవుడ్‌ నటుడికి స్నేహితురాలని గుర్తించారు. కోకాపేటలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివసించే లావణ్య అలియాస్‌ అన్విత(33) డ్రగ్స్‌

నార్సింగ్‌, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): గోవా నుంచి డ్రగ్స్‌ తెప్పించిన ఓ యువతిని సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఆమె ఓ టాలీవుడ్‌ నటుడికి స్నేహితురాలని గుర్తించారు. కోకాపేటలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివసించే లావణ్య అలియాస్‌ అన్విత(33) డ్రగ్స్‌ తెప్పించుకుంటున్నారనే సమాచారంతో మాదాపూర్‌ ఎస్‌వోటీ పోలీసులు నిఘా పెట్టారు. ఆదివారం ఆమెకు డ్రగ్స్‌ అందాయనే పక్కా సమాచారం రావడంతో.. నార్సింగ్‌ పోలీసులతో కలిసి సంయుక్తంగా ఆమె ఫ్లాట్‌లో సోదాలు నిర్వహించారు. లావణ్య వద్ద 4 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ను సీజ్‌ చేశారు. ఆమెను నార్కోటిక్స్‌ చట్టం కింద అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు నార్సింగ్‌ ఏసీపీ లక్ష్మీనారాయణ వెల్లడించారు. ఆమెకు డ్రగ్స్‌ అందజేసిన వ్యక్తిని ఉనిత్‌రెడ్డిగా గుర్తించామని చెప్పారు. ఉనిత్‌రెడ్డితోపాటు.. అతని స్నేహితురాలు పరారీలో ఉన్నారని, వారిని అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని చెప్పారు. కాగా.. లావణ్య నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌లోనే ఓ టాలీవుడ్‌ నటుడు ఉంటున్నారు. అతని కోసమే లావణ్య డ్రగ్స్‌ తెప్పిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Updated Date - Jan 30 , 2024 | 07:07 AM

Advertising
Advertising