ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

తేమ వచ్చిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలి

ABN, Publish Date - Nov 28 , 2024 | 12:44 AM

రైతుల నుండి తేమ వచ్చిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని జగిత్యాల జిల్లా కలెక్టర్‌ బి. సత్యప్రసాద్‌ అన్నారు. ధర్మపురి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో డీసీఎంఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

జిల్లా కలెక్టర్‌ సత్యప్రసాద్‌

ధర్మపురి, నవంబరు 27 ( ఆంధ్రజ్యోతి ): రైతుల నుండి తేమ వచ్చిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని జగిత్యాల జిల్లా కలెక్టర్‌ బి. సత్యప్రసాద్‌ అన్నారు. ధర్మపురి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో డీసీఎంఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ వరి దాన్యం ఎంత మొత్తంలో వస్తుందని, ధాన్యానికి సంబంధించిన తేమ ఏ విధంగా ఉందని పరిశీలించారు. వరి ధాన్యాన్ని తీసుకుని తేమ శాతం ఏ విధంగా ఉందని ఆయన తనిఖీ చేశారు. ప్రస్తుతం ధాన్యాన్ని ఎంత వరకు కొనుగోలు చేశారని, ఇంకా ఎంత వరకు ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులను వివరాలు అడిగి ఆయన తెలసుకున్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని, తేమ వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆయన అన్నారు. అలాగే సన్న రకం ధాన్యానికి ప్రభుత్వం ఇస్తున్న రూ 500 బోనస్‌ ధాన్యం కొనుగోలు చేసిన రైతులకు ఎప్పటికప్పుడు వారి బ్యాంక్‌ ఖాతాలో బోనస్‌ జమ చేయాలని ఆయన తెలిపారు. అలాగే మిగతా రైతులకు ప్రభుత్వ సెంటర్ల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేసేలా అవగాహన కల్పించాలని ఆయన అన్నారు. ధాన్యాన్ని కొనుగోలు చేసి వేగవంతంగా రైస్‌మిల్‌కు తరలించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఆయన వెంట జగిత్యాల ఆర్‌డీవో మదుసూధన్‌, డీఆర్‌డీవో రఘువరణ్‌, మండల తహసీల్దార్‌ కృష్ణప్రసాద్‌, ఎంపీడీవో రవీందర్‌, మున్సిపల్‌ కమీషనర్‌ శ్రీనివాస్‌, ఏఎంసీ కార్యదర్శి భూమన్న, ఎంఏవో సిందూజ, ఆర్‌ఐ వెంకటేష్‌, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 28 , 2024 | 12:44 AM