ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TS Politics: నీ కుటుంబానికి ఏం తక్కువ చేశాం.. కే.కేశవరావుపై కేసీఆర్ తీవ్ర అసహనం

ABN, Publish Date - Mar 28 , 2024 | 07:07 PM

బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ, పార్టీ జనరల్ సెక్రటరీ కంచర్ల కేశవ రావుపై ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇటీవల కేకే వ్యవహరిస్తున్న తీరుపై కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘నీ ఫ్యామిలీకి పార్టీ ఏం తక్కువ చేసింది’’ అంటూ ఆయన వద్దే అసహనం వ్యక్తం చేశారు. కేశవరావు వచ్చి కలిసిన సందర్భంలో కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా ఈ భేటీ అనంతరం కేకే కూడా తీవ్ర అసహనంతో ఇంటికి వెళ్లిపోయారు. ఇక కేకే నివాసానికి మాజీ ఇంద్ర కరణ్ రెడ్డి వెళ్లడం హాట్ టాపిక్‌గా మారింది.

హైదరాబాద్: బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ, పార్టీ జనరల్ సెక్రటరీ కంచర్ల కేశవ రావుపై ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇటీవల కేకే వ్యవహరిస్తున్న తీరుపై కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘నీ ఫ్యామిలీకి పార్టీ ఏం తక్కువ చేసింది. సాకులు చెప్పవద్దు. తగిన ప్రాధాన్యత ఇచ్చినా ఎందుకు పార్టీ మారుతున్నారు ’’ అంటూ ఆయన వద్దే అసహనం వ్యక్తం చేశారు. కేశవరావు వచ్చి కలిసిన సందర్భంలో కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా ఈ భేటీ అనంతరం కేకే కూడా తీవ్ర అసహనంతో ఇంటికి వెళ్లిపోయారు. ఇక కేకే నివాసానికి మాజీ ఇంద్ర కరణ్ రెడ్డి వెళ్లడం హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఇంద్ర కరణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారంటూ ఊహాగానాలు వ్యక్తమవుతోన్న విషయం తెలిసిందే.

మీడియాపై కేకే ఫ్రస్టేషన్

కేసీఆర్‌తో భేటీ అనంతరం కే కేశవరావు తన అసహనాన్ని మీడియాపై ప్రదర్శించారు. ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌజ్ నుంచి తన నివాసానికి చేరుకున్న సమయంలో మీడియా ప్రతినిధులు విజువల్స్ తీస్తుండగా ప్రస్టేషన్‌కు గురయ్యారు. ఇంటివద్ద వీడియోలు తీస్తున్న ప్రతినిధులపైకి దురుసుగా దూసుకొచ్చారు. ‘‘నన్ను వీడియో తీసుకోండి’’ అంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు.

కాగా కేకే కూతురు, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మీ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమైంది. ఎల్లుండి ఆమె పార్టీలో చేరబోతున్నట్టు క్లారిటీ వచ్చింది. కాగా కే కేశవ రావు కూడా హస్తం పార్టీ గూటికి చేరబోతున్నారంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి. పొలిటికల్ సర్కిల్స్‌లో ఆసక్తికరమైన చర్చ కూడా జరగుతోంది. మరి కేకే ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాలి. మరోవైపు కేకే కుమారుడు విప్లవ్ రావు కాంగ్రెస్ పార్టీలో చేరబోనని ప్రకటన చేశారు.

Updated Date - Mar 28 , 2024 | 07:43 PM

Advertising
Advertising