ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మూసీ డ్యాం రక్షణ గోడ నుంచి నీటి లీకేజీలు

ABN, Publish Date - Oct 27 , 2024 | 12:49 AM

ఎగువ మూసీ పరివాహక ప్రాంతా లు, హైదరాబా ద్‌ నగరం నుం చి గత జూన్‌ నెల నుంచి ని రంతరాయంగా వస్తున్న వరద నీటితో ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టానికి చేరుకుని నిండుకుండలా ఉంది.

క్రస్టుగేట్ల పక్కన గల గోడ నుంచి భారీగా లీకవుతున్న నీరు

మూసీ డ్యాం రక్షణ గోడ నుంచి నీటి లీకేజీలు

కేతేపల్లి, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): ఎగువ మూసీ పరివాహక ప్రాంతా లు, హైదరాబా ద్‌ నగరం నుం చి గత జూన్‌ నెల నుంచి ని రంతరాయంగా వస్తున్న వరద నీటితో ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టానికి చేరుకుని నిండుకుండలా ఉంది. ప్రాజెక్టు నీటినిల్వ సామర్థ్యం 645అడుగులు(4.46టీఎంసీలు)కాగా ప్రస్తుతం 643.80అడుగులు(4.15టీఎంసీలు)గా ఉంది. ఈ ప్రాజెక్టు నిర్మాణం సందర్భంగా ప్రధాన డ్యాంకు ఇరువైపులా రక్షణ గోడను నిర్మించారు. ఈ రక్షణ గోడ మీదుగా ఉన్న రహదారిపై నుంచి వాహనా లు, మనుషు లు రాకపోకలు సాగిస్తుంటారు. జలాశయంలోని నీటికి రక్షణగా ఉండాల్సిన గోడకు క్ర స్టుగేట్ల వైపు పగుళ్లు వచ్చి, బుంగలు పడ్డాయి. ఈ పగుళ్లు, బుంగల ద్వారా కొన్నాళ్లు గా నీరు లీకవుతుంది. ఏళ్ల తరబడి మరమ్మతులు చేయకపోవడంతో ప్రాజెక్టు నుంచి ఎంతో విలువైన నీరు వృథాగా పోతుంది. మరమ్మతులు లేకపోవడంతో ఇవి మరింత పెద్దవయ్యే ప్రమాదం పొంచి ఉన్నందున అధికారులు స్పందించి రక్షణ గోడకు మరమ్మతులు చేసి విలువైన నీటి వృథాను అరికట్టాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.

Updated Date - Oct 27 , 2024 | 12:49 AM