ఎకరం తిరిగివ్వాలని నాగమణి ఒత్తిడి చేయడంతోనే!
ABN, Publish Date - Dec 04 , 2024 | 05:43 AM
ఇబ్రహీంపట్నం పరిధిలోని రాయపోల్‌లో పోలీస్ కానిస్టేబుల్ కొంగర నాగమణిని పథకం ప్రకారమే తమ్ముడు పరమేశ్ హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. సంచలనం రేపిన ఈ
కులాంతర వివాహం, ఆస్తి తగాదాతోనే మహిళా కానిస్టేబుల్ హత్య
నిందితుడు పరమేశ్‌కు సహకరించిన స్నేహితుడు శివ
నాగమణి కదలికలపై ఫోన్లో పరమేశ్‌కు సమాచారం
ఇబ్రహీంపట్నం, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): ఇబ్రహీంపట్నం పరిధిలోని రాయపోల్‌లో పోలీస్ కానిస్టేబుల్ కొంగర నాగమణిని పథకం ప్రకారమే తమ్ముడు పరమేశ్ హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. సంచలనం రేపిన ఈ హత్యకు కులాంతర వివాహం, ఆస్తి తగాదాలే కారణం అని తేల్చా రు. ఈ హత్యకు సంబంధించి వివరాలతో కూడిన ప్రకటనను సీఐ సత్యనారాయణ మంగళవారం పత్రి కలకు విడుదల చేశారు. నిందితుడు పరమేశ్‌ను మంగళవారం ఉదయం రాయపోల్ సమీపంలోని జ నహర్ష ఫాం ల్యాండ్స్ పరిసరాల్లో అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు పంపినట్లు వెల్లడించారు. వివరాల్లోకి వెళితే.. నిందితుడు పరమేశ్‌కు ఇద్దరు అక్కలు. పెద్ద అక్క హైమావతికి 2009లో వివాహం కాగా తన కుటుంబంతో ఆమె తుర్కయాంజాల్ ఉం టోంది. పదేళ్ల క్రితమే వీరి తల్లిదండ్రులు పద్మ, రమేశ్ అనారోగ్యంతో మృతి చెందారు. ఆ తర్వాత పరమేశ్, నాగమణి.. నాయనమ్మ యాదమ్మతో కలి సి ఉంటున్నారు. 2014లో నాగమణికి ఎంపీ పటేల్‌గూడకు చెందిన వ్యక్తితో వివాహం జరిపించారు. పెళ్లి సమయంలో పసుపు, కుంకుమల కింద ఎకరా పొలం రాసిచ్చారు. భర్తతో మనస్పర్థలు రావడంతో నాగమణి భర్తకు దూరంగా హయత్‌నగర్‌లోని హాస్టల్లో ఉంటూ కోచింగ్ తీసుకుని 2020లో పోలీస్ కానిస్టేబుల్‌గా ఉద్యోగం సాధించింది. ముందు పోస్టింగ్ కుషాయిగూడ కాగా, ఆ తర్వాత హయత్‌నగర్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తోంది. 2022లో భర్తతో విడాకులు తీసుకుంది. రాయపోల్‌లో ఉన్న సమయంలో అదే గ్రామానికి చెందిన వేరే కులానికి చెందిన బండారి శ్రీకాంత్‌తో పరిచయం ఏర్పడి ప్రేమకు దారితీసింది. విషయం తెలిసి ఊర్లో పరువు పోతుందని అతడితో స్నేహం వద్దని తమ్ముడు పరవేశ్ పలుమార్లు ఆమెను హెచ్చరించారు. ఆమె వినకపోవడంతో అప్పట్లో పసుపు, కుంకుమల కింద ఇ చ్చిన ఎకరం భూమి తనకివ్వాలంటూ ఒత్తిడి తెచ్చి పరమేశ్ తన పేరున రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఆ తర్వాత గత నెల 10న యాదగిరిగుట్ట వద్ద నాగమణి, శ్రీకాంత్‌ను వివాహం చేసుకుంది. వీరు వనస్థలిపురం ఏరియా సహారా ఎస్టేట్స్‌లో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. అయితే అప్పట్లో తనకిచ్చిన ఎకరం భూమిని తిరిగి ఇవ్వాలంటూ నాగమణి తమ్ముడిపై ఒత్తిడి తేవడం మొదలెట్టింది. అసలే కులాంతర వివాహం చేసుకుని తనకు తలవంపులు తేవడమేగాక తిరిగి భూమి కావాలంటూ ఒత్తిడి తేవడాన్ని పరమేశ్ జీర్ణించుకోలేకపోయాడు. ఎలాగైనా ఆమెను మట్టుబెట్టాలనే నిర్ణయానికి వచ్చి అదనుకోసం వేచిచూడడం మొదలెట్టాడు.
గ్రామానికి వచ్చినట్లు తెలుసుకుని..
పెళ్లైన తర్వాత నాగమణి భర్తతో కలిసి ఆదివారం అత్తారింటికి వచ్చిందని తెలుసుకుని ఎలాగైనా ఆమెను మట్టుబెట్టాలని పరమేశ్ పథకం వేశాడు. అతడి స్నేహితుడైన అచ్చన శివ ద్వారా ఆమె కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకున్నాడు. సోమవా రం ఉదయం భర్త శ్రీకాంత్ ముందుగానే డ్యూటీకని నగరానికి బయలుదేరగా, తర్వాత నాగమణి ఉద యం 8.30గంటలకు తన స్యూటీపై డ్యూటీకి హయత్‌నగర్ బయలుదేరింది. ఈ విషయాన్ని శివనే ఫోన్లో పరమేశ్‌కు సమాచారమిచ్చాడు. ఆ ప్రకారం నాగమణిని కారులో వెంబండించిన పరమేశ్ మాన్యగూడ రోడ్డు సబ్‌స్టేషన్ వద్ద కారుతో స్కూటీని ఢీ కొట్టాడు. ఆమె కింద పడిపోగానే కారులోంచి వేట కొడవలితో కిందకు దిగి.. మెడపై, ముఖంపై నరి కాడు. తీవ్ర రక్తస్రావంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. కాగా నిందితుడిని పోలీసులు రిమాండ్‌కు పంపారు. అతడు ఉపయోగించిన వేట కొడవలి, ఐ- ఫోన్-15, మహీంద్రా ఎక్సయూవీ కారునును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నాగమణి కదలికలను చేరవేసిన శివను ఈ కేసులో ఏ-2గా చేర్చి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు.
Updated Date - Dec 04 , 2024 | 05:43 AM