నుడాతో అభివృద్ధికి నాంది
ABN, Publish Date - Oct 27 , 2024 | 11:24 PM
నాగర్ కర్నూల్ అర్బన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీగా నాగర్ కర్నూల్ జిల్లాను మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం అభివృద్ధికి నాంది పలికినట్లేనని ఎమ్మెల్యే డాక్ట ర్ వంశీకృష్ణ అన్నారు.
నాగర్‌కర్నూల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీపై ఎమ్మెల్యే వంశీకృష్ణ
లఅచ్చంపేట/ అచ్చంపేట టౌన్, అక్టోబరు 27 (ఆంధ్ర జ్యోతి) : నాగర్ కర్నూల్ అర్బన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీగా నాగర్ కర్నూల్ జిల్లాను మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం అభివృద్ధికి నాంది పలికినట్లేనని ఎమ్మెల్యే డాక్ట ర్ వంశీకృష్ణ అన్నారు. గురు వారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాల యంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో 18మండలాలతో పాటు 319 గ్రామాల ను అన్నిరంగాలలో అభివృద్ధి చెందేందుకు సీఎం రేవంత్‌రెడ్డి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీగా ప్రకటించారని గుర్తు చేశారు. అచ్చంపేట నియో జకవర్గంలో 8 మండలాలకు గాను 6 మండలా లను ప్రకటించారని తెలిపారు. త్వరలో ముఖ్య మంత్రిని కలిసి జిల్లాలోని అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో కలవని గ్రామాలను, మండలాలను కలిపేవిధంగా విజ్ఞప్తి చేస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ శ్రీనివాసులు, ఉమామహేశ్వర ఆలయ అధ్యక్షు డు మాదవరెడ్డి, నాయకులు మల్లేష్, రామనా థం, రఘు, పాలశీతలీకరణ కేంద్రం అధ్యక్షుడు నర్సయ్య యాదవ్, ఖాదర్, పవన్ పాల్గొన్నారు.
ప్రణాళికలతో ఆలయ అభివృద్ధి
అత్యంత్య ప్రాముఖ్యత కలిగిన ప్రాచీనమైన ఉమామహేశ్వర దేవాలయం అభివృద్ధికి పెద్ద పీట వేస్తామని ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. ఉమామహేశ్వర క్షేత్రాని ఆయన సందర్శించారు. ఈశ్వరుని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నా రు. అనంతరం భోగమహేశ్వరంలో త్వరలో ప్రారంభించే పనులను ఆయన పరిశీలించారు. త్వరలో అభివృద్ధి పనుల శంకుస్థాపనలకు రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వస్తు న్నట్లు తెలిపారు. అచ్చంపేట పట్టణంలోని 132 కేవీ సబ్‌స్టేషన్‌ను పరిశీలించి యాసంగి పంటకు రైతులకు ఇబ్బందులు లేకుండా విద్యుత్ సర ఫరా చేయాలన్నారు. ఆలయ కమిటీ చైర్మన్ బీరం మాధవరెడ్డి, ఈవో శ్రీనివాస రావు, నాయ కులు గోపాల్‌రెడ్డి, రామనాథం, లచ్చునా యక్, లోక్యానాయక్, డైరెక్టర్లు పవన్, కృష్ణ పాల్గొన్నారు.
Updated Date - Oct 27 , 2024 | 11:24 PM