సీఎం రేవంత్‌ను కలిసిన ‘అమరజ్యోతి’ రూపశిల్పి
ABN, Publish Date - Mar 27 , 2024 | 04:39 AM
తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం ‘అమరజ్యోతి’ రూపశిల్పి ఎంవీ రమణారెడ్డి మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. కళారంగ సమస్యలను పరిష్కరించాలని ఈ
కళారంగ సమస్యలపై సీఎంకు వినపతిపత్రం
హైదరాబాద్ సిటీ, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం ‘అమరజ్యోతి’ రూపశిల్పి ఎంవీ రమణారెడ్డి మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. కళారంగ సమస్యలను పరిష్కరించాలని ఈ సందర్భంగా సీఎంను ఆయను కోరారు. అలాగే తెలంగాణ లలిత కళా అకాడమీని పునరుద్ధరించడంతో పాటు హైదరాబాద్ ఆర్ట్ సొసైటీకి ప్రత్యేక స్థలం కేటాయించమని వినతి పత్రం అందించారు. చిత్రకారుడైన రేవంత్ తెలంగాణ కళారంగం దేశంలోనే అగ్రగామిగా నిలవాలనే ఆకాంక్షను వెలిబుచ్చడంతో పాటు కళారంగానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను తనతో చర్చించారని రమణా రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా రేవంత్‌కు ‘అమరజ్యోతి’పై తాను రాసిన పుస్తకంతోపాటు ప్రత్యేక జ్ఞాపికను ఆయన అందించారు.
Updated Date - Mar 27 , 2024 | 04:39 AM