ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

తీపి కబురు ఎప్పడో?

ABN, Publish Date - Sep 29 , 2024 | 11:30 PM

ఫలితాల కోసం డీఎస్సీ అభ్యర్థులకు ఎదురు చూపులు తప్పడం లేదు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ నిర్వహించి మూడు నెలలు కావస్తున్నా ఇంత వరకు ఫలితాలు ప్రకటించక పోవడంతో అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఆలస్యం ఎందుకవుతోందని పరీక్షకు హాజరైన అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. అయితే జిల్లాలో ఉపాధ్యాయ పోస్టుల కోసం అభ్యర్థుల మధ్యతీవ్ర పోటీ నెలకొంది. రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులకు పోటీ తీవ్రంగా ఉన్న జిల్లాల్లో వికారాబాద్‌ మూడో స్థానంలో ఉంది. ఒక పోస్టుకు 50 నుంచి 100 మంది వరకు పోటీపడుతున్నారు. ఎస్జీటీ పోస్టుల విషయానికొస్త్తే రాష్ట్రంలో ఎక్కువ పోటీ వికారాబాద్‌ జిల్లాలోనే నెలకొనడం గమనార్హం.

డీఎస్పీ అభ్యర్థులకు తప్పని ఎదురుచూపులు

దసరా వరకూ ఎంపికపై అనుమానమే

పరీక్షలు పూర్తయి మూడు నెలలు

అయినా వెల్లడించని ర్యాంకులు

అందోళనలో ఆశావహ అభ్యర్థులు

ఫలితాల కోసం డీఎస్సీ అభ్యర్థులకు ఎదురు చూపులు తప్పడం లేదు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ నిర్వహించి మూడు నెలలు కావస్తున్నా ఇంత వరకు ఫలితాలు ప్రకటించక పోవడంతో అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఆలస్యం ఎందుకవుతోందని పరీక్షకు హాజరైన అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. అయితే జిల్లాలో ఉపాధ్యాయ పోస్టుల కోసం అభ్యర్థుల మధ్యతీవ్ర పోటీ నెలకొంది. రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులకు పోటీ తీవ్రంగా ఉన్న జిల్లాల్లో వికారాబాద్‌ మూడో స్థానంలో ఉంది. ఒక పోస్టుకు 50 నుంచి 100 మంది వరకు పోటీపడుతున్నారు. ఎస్జీటీ పోస్టుల విషయానికొస్త్తే రాష్ట్రంలో ఎక్కువ పోటీ వికారాబాద్‌ జిల్లాలోనే నెలకొనడం గమనార్హం.

వికారాబాద్‌, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): డీఎస్సీ పరీక్ష ఫలితాలు ప్రకటించి ఎంపికైన అభ్యర్థులకు ఉపాధ్యాయ దినోత్సవం రోజు ప్రభుత్వం నియామక పత్రాలు అందజేసేందుకు సన్నాహాలు చేస్తోందనే ప్రచారం జరిగింది. అయితే ఇంత వరకు జనరల్‌ ర్యాంకులు ప్రకటించలేదు. ఎంతో సెంటిమెంట్‌గా భావించే దసరా పండగ వరకైనా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెబుతుందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు డీఎస్సీ అభ్యర్థులకు ఎదురు చూపులు తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. ఫైనల్‌ కీ విడుదల చేసి 20 రోజులు గడిచిపోయినా ఇంత వరకు ఫలితాలు విడుదల చేయలేదు. జిల్లా వారీగా జనరల్‌ ర్యాంకులు, 1:3 అభ్యర్థుల జాబితాల కోసం పరీక్ష రాసిన అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామంటున్న ప్రభుత్వం డీఎస్సీ నిర్వహించి మూడు నెలలవుతున్నా ర్యాంకుల ప్రకటనపై ఎందుకు దృష్టి సారించడం లేదని వారు మండిపడుతున్నారు.

సర్దుబాటు ఉత్తర్వులతో ఆందోళన

జిల్లాలోని ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో 359 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి 29న రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసి దరఖాస్తులు స్వీకరించింది. జూలై 18వ తేదీ నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు వివిధ కేటగిరీల ఉపాధ్యాయ పోస్టుల కోసం డీఎస్సీ పరీక్షలు నిర్వహించింది. ఫైనల్‌ కీ ప్రకటించిన అధికారులు ఇంత వరకు ఫలితాలు ప్రకటించలేదు. జనరల్‌ ర్యాంకులు ఎప్పుడు ప్రకటిస్తారనేది స్పష్టత ఇవ్వడం లేదు. ఇదే సమయంలో విద్యార్థులు తక్కువగా ఉండి... ఎక్కువ మంది ఉపాధ్యాయులు పనిచేస్తుంటే .. వారిని తాత్కాలికంగా ఇతర పాఠశాలలకు సర్దుబాటు చేసేందుకు వీలుగా విద్యా శాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశాలల్లో ఉపాధ్యాయులను సర్దుబాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ మరింత ఆలస్యమవుతుందనే సంకేతాలు ఇస్తోందని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తుది ఫలితాలు ప్రకటించి సర్టిఫికేట్ల పరిశీలన ప్రక్రియ పూర్తి చేసి అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కనీసం మూడు వారాల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు.

359 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

భరీ ్తచేసే ఉపాధ్యాయ పోస్టుల్లో 102 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు, 195 సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్‌జీటీ), 23 లాంగ్వేజ్‌ పండిత్‌, 5 ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ పోస్టులు ఉన్నాయి. అంతే కాకుండా స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ విభాగంలో 6 స్కూల్‌ అసిస్టెంట్‌, 28 ఎస్‌జీటీ పోస్టులు కూడా ఉన్నాయి. మొత్తం 195 ఎస్‌జీటీ పోస్టుల్లో 169 తెలుగు మీడియం, 26 ఉర్దూ మీడియం పోస్టులు ఉన్నాయి. తెలుగు మీడియం ఎస్‌జీటీ పోస్టుల్లో ప్రభుత్వ పాఠశాలలకు 6, స్థానిక సంస్థల పాఠశాలలకు 163 పోస్టులు కేటాయించారు. ఈ పోస్టుల్లో ఓసీలకు 50, ఎస్సీలకు 24, ఎస్టీలకు 16, బీసీ-ఏ కేటగిరికి 13, బీసీ-బీకి 15, బీసీ-సీకి 4, బీసీ-డీకి 10, బీసీ-ఈ కేటగిరికి 6, దివ్యాంగులకు (పీహెచ్‌) 8 పోస్టులు, ఈడబ్ల్యూఎ్‌సకు 16 పోస్టులు కేటాయించారు. లాంగ్వేజ్‌ పండిత్‌ హిందీ పోస్టుల్లో మొత్తం 11 పోస్టులు ఖాళీ ఉండగా, ఓసీలకు 4, ఎస్సీలకు 2, ఎస్టీలకు ఒకటి, బీసీ-ఏ, బీసీ-బీ కేటగిరిలకు, దివ్యాంగులకు, ఈడబ్ల్యూఎస్‌ కేటగిరిలకు ఒక్కో పోస్టు కేటాయించారు. సంస్కృతం పోస్టుల్లో భర్తీ చేయనున్న ఒక పోస్టును ఓసీలకు కేటాయించారు. తెలుగు పండిత్‌ పోస్టులు 8 ఉండగా, వాటిలో ఓసీలకు 4, ఎస్సీలకు 2, బీసీ-ఏ, దివ్యాంగులకు ఒక్కో పోస్టు కేటాయింపు చేశారు. ఉర్దూ పండిత్‌ పోస్టులు 3 ఉండగా, దాంట్లో ఓసీలకు 2, ఎస్సీలకు ఒక పోస్టు కేటాయించారు. ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ పోస్టులు 5 ఉండగా, ఓసీలకు 3, ఎస్సీలకు, బీసీ-ఏ కేటగిరికి ఒక్కో పోస్టు కేటాయింపు జరిపారు. 102 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుల్లో బయోసైన్స్‌ 21, ఇంగ్లీష్‌ 23, హిందీ 3, తెలుగు 9, ఉర్దూ 3, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ 3, ఫిజికల్‌ సైన్స్‌ 6 (తెలుగు 4, ఉర్దూ 2), సోషల్‌ స్టడీస్‌ 25 (తెలుగు 23, ఉర్దూ 2), తెలుగు 7, ఉర్దూ 2 పోస్టులు ఉన్నాయి. జిల్లాలో 34 స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ పోస్టులు ఉండగా, వాటిలో 6 స్కూల్‌ అసిస్టెంట్‌ (తెలుగు), 28 ఎస్‌జీటీ పోస్టులు ఉన్న విషయం విదితమే. ఎస్‌జీటీ పోస్టుల్లో ఓసీలకు 9, ఎస్సీలకు 5, ఎస్టీలకు 3, బీసీ-ఏ, బీసీ-బీ కేటగిరిలకు రెండేసి పోస్టులు ఉన్నాయి. బీసీ-సీ, బీసీ-డీ, బీసీ-ఈ కేటగిరిలకు, దివ్యాంగులకు ఒక్కో పోస్టు కేటాయించారు.

జిల్లాలో తీవ్రపోటీ...

జిల్లాలో భర్తీ చేసే పోస్టులు తక్కువ ఉండడంతో పోటీ పడే అభ్యర్థుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఫలితంగా అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుల్లో ఒక్కో పోస్టుకు 60 నుంచి 80 మంది వరకు పోటీ పడుతుండగా, ఎస్జీటీ పోస్టుకు 35 నుంచి 50 మంది పోటీలో ఉన్నారు. జనరల్‌ ర్యాంకులు ప్రకటిస్తే ఎవరెవరికీ ఉద్యోగావకాశాలు దక్కనున్నాయనేది కొంత వరకు స్పష్టత రానుంది. 1:3 అభ్యర్థుల జాబితా ప్రకటిస్తే కేటగిరీల వారీగా అభ్యర్థులు ఓ అంచనాకు వచ్చే అవకాశం ఉంటుంది. ఖాళీగా ఉన్న పోస్టుల మేరకు నోటిఫికేషన్‌ జారీ చేసి ఉంటే.. చాలా కాలంగా ఉపాధ్యాయ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న ఎక్కువ మందికి న్యాయం జరిగేందుకు అవకాశం ఉండేదన్న అభిప్రాయం అభ్యర్థులు అభిప్రాయ పడుతున్నారు. జీవో 317 కారణంగా జిల్లా నుంచి ఇతర జిల్లాలకు వెళ్లిన ఉపాధ్యాయుల కంటే ఇతర జిల్లాల నుంచి వికారాబాద్‌ జిల్లాకు వచ్చిన ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్నారు. ముఖ్యంగా ఇతర జిల్లాల నుంచి ఎస్జీటీలను జిల్లాకు ఎక్కువ సంఖ్యలో కేటాయించారు. ఫలితంగా జిల్లాలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల్లో 320 పోస్టులను కోల్పోయిన విషయం తెలిసిందే.

Updated Date - Sep 29 , 2024 | 11:30 PM