Seetadaya Karreddy : బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్‌పర్సన్‌గా సీతాదయాకర్‌రెడ్డి?
ABN, Publish Date - Dec 18 , 2024 | 06:21 AM
రాష్ట్రంలోని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైౖర్‌పర్సన్‌గా మాజీ ఎమ్మెల్యే కొత్తకోట సీతాదయాకర్‌రెడ్డి నియమితులు కానున్నట్లు సమాచారం. చైర్‌పర్సన్‌తోపాటు ఆరుగురు సభ్యులను
నియమించనున్న ప్రభుత్వం!
హైదరాబాద్, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైౖర్‌పర్సన్‌గా మాజీ ఎమ్మెల్యే కొత్తకోట సీతాదయాకర్‌రెడ్డి నియమితులు కానున్నట్లు సమాచారం. చైర్‌పర్సన్‌తోపాటు ఆరుగురు సభ్యులను భర్తీ చేసేందుకు మహిళా, శిశు, వికలాంగులు, వయోవృద్ధుల శాఖ నవంబరు 25 నుంచి డిసెంబరు 2 వరకు దరఖాస్తుల స్వీకరించింది. దాదాపు 445 దరఖాస్తులు వచ్చినట్టు సమాచారం. వీటిని పరిశీలించి, సభ్యులను ఖరారు చేసేందుకు మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి, శాఖ ముఖ్య కార్యదర్శితో పాటు మరో ఇద్దరు సభ్యులతో కలిపి ప్రభుత్వం త్రిసభ్య కమిటీని ఏర్పాటుచేసింది. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే.. మహబూబ్‌నగర్ జిల్లాలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలోనే సీతాదయాకర్‌రెడ్డికి కమిషన్ చైర్‌పర్సన్ పోస్టు వరించనున్నట్టు ప్రచారం జరిగింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ సోషియాలజీ చేసిన సీతాదయాకర్‌రెడ్డి 2009లో దేవరకద్ర నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు.
Updated Date - Dec 18 , 2024 | 06:21 AM