సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
ABN, Publish Date - Dec 13 , 2024 | 01:10 AM
విద్యాశాఖలో సేవలందిస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు సమ్మె చేయడం విచారకరమని, వారి సమ్మెకు తమ సంఘాల సంపూర్ణ మద్దతు ఉంటుందని పీఆర్టీ యూ, టీఆర్‌టీఎఫ్ ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధనకోసం నిరవధిక సమ్మెచేస్తున్న ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల దీక్ష మూడో రోజుకు చేరింది.
జగిత్యాల అగ్రికల్చర్, డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి): విద్యాశాఖలో సేవలందిస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు సమ్మె చేయడం విచారకరమని, వారి సమ్మెకు తమ సంఘాల సంపూర్ణ మద్దతు ఉంటుందని పీఆర్టీ యూ, టీఆర్‌టీఎఫ్ ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధనకోసం నిరవధిక సమ్మెచేస్తున్న ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల దీక్ష మూడో రోజుకు చేరింది. ఈ సందర్భంగా మూడో రోజు నిరసన కార్యక్రమంలో భాగంగా వారు మోకాళ్లపై కూర్చొని తమ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి పీసీసీగా ఉన్నసమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకో వాలని డిమాండ్ చేశారు. అనంతరం పీఆర్టీయూ సంఘ బాధ్యులు ఆనందరావు, అమర్నాథ్ రెడ్డి, టీఆర్‌టీఎఫ్ బాధ్యులు కటకం రమేష్, మారెడ్డి అంజిరెడ్డిలు మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఇచ్చిన హామి మేరకు వారిని రెగ్యులరైజ్ చేయాలన్నారు. న్యాయమైన డిమాండ్‌లను పరిష్కరించి ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల సమ్మెను ప్రభుత్వం విరమింపజేయాలని కోరారు. ఈ దీక్షకు రాష్ట్రీయ పండిత పరిషత్తు సంఘ గౌరవఅధ్యక్షుడు సూర్య నారాయణ, విశ్రాంత ఉద్యోగ సంఘ బాధ్యులు గంగారాజం, మిసాక్ అహ్మద్, కంటె అంజయ్య, విఠలయ్య, టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బోగ రమేష్, జిల్లా అధ్యక్షుడు రాంచంద్రం, ఎమ్మెల్సీ అభ్యర్థి రాపాల రాజు తమ మద్దతు ప్రకటించి సంఘీభావం తెలిపారు.
Updated Date - Dec 13 , 2024 | 01:10 AM