లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి రేవంత్ సంసిద్ధం
ABN, Publish Date - Jan 29 , 2024 | 03:52 AM
లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ప్రారంభానికి ముందే ప్రజలకు మధ్యకు వెళ్లి.. కాంగ్రెస్ తరఫున ప్రచారానికి సీఎం రేవంత్‌రెడ్డి సిద్ధమవుతున్నారు.
ఫిబ్రవరి 2న ఇంద్రవెల్లిలో..5న కొడంగల్‌లో పర్యటన
హైదరాబాద్, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ప్రారంభానికి ముందే ప్రజలకు మధ్యకు వెళ్లి.. కాంగ్రెస్ తరఫున ప్రచారానికి సీఎం రేవంత్‌రెడ్డి సిద్ధమవుతున్నారు. ఓవైపు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూనే.. మరోవైపు పార్టీ ఆధ్వర్యంలో బహిరంగ సభలు ఏర్పాటు చేసి.. జనానికి చేరువయ్యేలా కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. అందులో భాగంగానే సీఎం ఇంద్రవెల్లి, కొడంగల్ పర్యటనలు ఖరారయ్యాయి. పిబ్రవరి 2న ఉదయం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో ఉన్న నాగోబా దేవాలయాన్ని ఆయన సందర్శిస్తారు. అదేవిధంగా అమరుల స్మారక స్తూపం నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు కాంగ్రెస్ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. అదేవిధంగా 5వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో పర్యటించనున్నారు. అక్కడ నిర్వహించే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొని అనంతరం అక్కడ ఏర్పాటు చేసే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.
Updated Date - Jan 29 , 2024 | 07:12 AM