ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వృత్తిదారుల సంక్షేమానికి కృషి

ABN, Publish Date - Nov 25 , 2024 | 12:02 AM

వృత్తిదారుల సంక్షేమం కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. ఆదివారం ఇబ్రహీపట్నం పెద్ద చెరువులో మత్స్య శాఖ ఆధ్వర్యంలో ఫిషరీస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ మెట్టు సాయికుమార్‌తో కలిసి ఉచిత చేపపిల్లలను వదిలారు.

చేప పిల్లలను వదులుతున్న ఎమ్మెల్యే, ఫిషరీస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌

ఇబ్రహీంపట్నం, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): వృత్తిదారుల సంక్షేమం కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. ఆదివారం ఇబ్రహీపట్నం పెద్ద చెరువులో మత్స్య శాఖ ఆధ్వర్యంలో ఫిషరీస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ మెట్టు సాయికుమార్‌తో కలిసి ఉచిత చేపపిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొర్రెలు, చేప పిల్లల పంపిణీలోనూ గత ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. రాష్ట్రంలో చెరువులు, కుంటల పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకుపోతుందన్నారు. ఇబ్రహీంపట్నం చెరువు సుందరీకణ పనులను త్వరలో చేపడతామన్నారు. చెరువులో వ్యర్ధాలను పారబోయొద్దని సూచించారు. కార్యక్రమంలో మత్స్యశాఖ జిల్లా అధికారి పూర్ణిమ, ఇబ్రహీంపట్నం మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ కప్పరి స్రవంతి, వైస్‌ చైరర్‌పర్సన్‌ బర్ల మంగ, ఉప్పరిగూడ ప్యాక్స్‌ చైర్మన్‌ ఏదుల్ల పాండురంగారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Nov 25 , 2024 | 12:02 AM