ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ప్రజలందరి సహకారంతోనే గ్రామాభివృద్ధి

ABN, Publish Date - Jan 29 , 2024 | 12:03 AM

ప్రజలందరి సహకారంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం అవుతుందని షాద్‌నగర్‌ ఎమ్యెల్యే వీర్లపల్లి శంకర్‌ అన్నారు. ఆదివారం మండల పరిధిలోని గుంజల్‌పహాడ్‌లో జడ్పీ నిధులతో నిర్మించిన అంగన్వాడీ కేంద్ర నూతన భవనాన్ని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డితో కలిసి ఎమ్మెల్యే శంకర్‌ ప్రారంభించారు.

అంగన్‌వాడీ భవనాన్ని ప్రారంభిస్తున్న జడ్పీ చైర్‌పర్సన్‌ అనితారెడ్డి, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌

చౌదరిగూడ, జనవరి 28 : ప్రజలందరి సహకారంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం అవుతుందని షాద్‌నగర్‌ ఎమ్యెల్యే వీర్లపల్లి శంకర్‌ అన్నారు. ఆదివారం మండల పరిధిలోని గుంజల్‌పహాడ్‌లో జడ్పీ నిధులతో నిర్మించిన అంగన్వాడీ కేంద్ర నూతన భవనాన్ని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డితో కలిసి ఎమ్మెల్యే శంకర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం పేరిట గ్రామ పంచాయతీలను అశాస్ర్తీయంగా ఏర్పాటు చేసిందని విమర్శించారు. ప్రజా సంక్షేమం కోసమే కాంగ్రెస్‌ పని చేస్తుందని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ ఖచ్చితంగా నేరవేర్చుతామన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చెయకుండా బాధ్యతయుతమైన పాలన అందిస్తామని చెప్పారు. గ్రామాభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేసేందుకు కృషి చేస్తానని అన్నారు. సర్పంచుల పదవీకాలం నాలుగు రోజుల్లో ముగుస్తుందని ఐదు సంవత్సరాలుగా సేవ చేసినందుకు వారిని అభినందించారు. సేవ చేసిన నాయకులను ప్రజలు ఎప్పుడు మరిచి పోరని చెప్పారు.

మహిళా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

మహిళా, శిశు సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని జడ్పీ చైర్‌పర్సన్‌ అనితారెడ్డి అన్నారు. మహిళలకు, చిన్నారులకు అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్ఠికాహారాన్ని అందించాలని అన్నారు. భవనాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. జడ్పీకి ఎమ్మెల్యే నిధులు తోడైతే గ్రామాల అభివృద్ధి మరింత సాధ్యం అవుతుందన్నారు. స్థానిక సమస్యలపై దృష్టి సారించి పని చేస్తేనే ప్రజాసమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు. జడ్పీటీసీ స్వరూప, సర్పంచ్‌ జ్యోతి, బాల్‌రాజ్‌, గోపాల్‌, ఎంపీటీసీ సత్యనారాయణరెడ్డి, సింగిల్‌విండో చైర్మన్‌ దామోదర్‌రెడ్డి, సీడీపీవో నాగమణి, మండలఅధ్యక్షుడు రాజు, చంద్రశేఖర్‌, వెంకట్‌నర్సింహారెడ్డి, వేణుగోపాల్‌, అన్వర్‌, రాజు, పాల్గొన్నారు.

Updated Date - Jan 29 , 2024 | 12:03 AM

Advertising
Advertising