కేశంపేట అభివృద్ధికి సహకరిచాలి
ABN, Publish Date - Jan 03 , 2024 | 12:44 AM
కేశంపేట మండలంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి అభివృద్ధికి సహకరించాలని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ జిల్లా స్టాడింగ్ కమిటీ చైర్‌పర్సన్, కేశంపేట జడ్పీటీసీ తాండ్ర విశాలాశ్రవణ్‌రెడ్డి దంపతులు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ను కోరారు.
ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌కు జడ్పీటీసీ వినతి
కేశంపేట, జనవరి 2: కేశంపేట మండలంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి అభివృద్ధికి సహకరించాలని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ జిల్లా స్టాడింగ్ కమిటీ చైర్‌పర్సన్, కేశంపేట జడ్పీటీసీ తాండ్ర విశాలాశ్రవణ్‌రెడ్డి దంపతులు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ను కోరారు. మంగళవారం షాద్‌నగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి, కొత్తూర్ మాజీ జడ్పీటీసీ శ్యాంసుందర్ రెడ్డిలను కలిసి పుష్పగుచ్ఛం అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేశంపేట మండల అభివృద్ధికి సహకరించాలని జడ్పీటీసీ ఎమ్మెల్యేను కోరారు.
Updated Date - Jan 03 , 2024 | 12:44 AM