నగదు, సెల్‌ఫోన్ అపహరణ
ABN, Publish Date - Oct 25 , 2024 | 11:18 PM
నిద్రిస్తున్న లారీ డ్రైవర్ జేబులో నుంచి నగదు, సెల్‌ఫోన్ అపహరించుకెళ్లిన ఘటన ఘట్‌కేసర్ పోలీ్‌సస్టేషన్‌లో చోటుచేసుకుంది.
ఘట్‌కేసర్ రూరల్ అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): నిద్రిస్తున్న లారీ డ్రైవర్ జేబులో నుంచి నగదు, సెల్‌ఫోన్ అపహరించుకెళ్లిన ఘటన ఘట్‌కేసర్ పోలీ్‌సస్టేషన్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నల్లగొండ టౌన్‌కు చెందిన నాగరాజు(25) ములుగు నుంచి ఇసుకలారీ లోడు హైదరాబాద్‌కు వెళుతుండగా శుక్రవారం తెల్లవారుజామున ఘట్‌కేసర్ మైసమ్మగుట్ట సమీపంపలోకి రాగానే లారీని రోడ్డు పక్కన పార్క్ చేసి పడుకున్నాడు. ఈ క్రమంలో గుర్తుతెలియని దుండగులు నాగరాజు జేబులోని రూ.5 వేల నగదు, సెల్‌ఫోన్ అపహరించుకెళ్లారు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Updated Date - Oct 25 , 2024 | 11:18 PM