ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మెరుగైన వసతుల కల్పనే ధ్యేయం

ABN, Publish Date - Jan 12 , 2024 | 11:59 PM

ప్రజలకు మెరుగైన వసతుల కల్పనే కాంగ్రెస్‌ ప్రభుత్వ ధ్యేయమని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని వెంకటాపూర్‌లో శుక్రవారం ఎమ్మెల్యే పర్యటించారు.

పనులు ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే కసిరెడ్డి

తలకొండపల్లి, జనవరి 12: ప్రజలకు మెరుగైన వసతుల కల్పనే కాంగ్రెస్‌ ప్రభుత్వ ధ్యేయమని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని వెంకటాపూర్‌లో శుక్రవారం ఎమ్మెల్యే పర్యటించారు. గ్రామంలో రూ. 50 లక్షలతో ఏర్పాటు చేసిన రెండు వాటర్‌ ట్యాంక్‌లు, సీసీ రోడ్లు, ప్రభుత్వ పాఠశాల ప్రహరీ, వంటశాలను సర్పంచ్‌ రమేశ్‌ యాదవ్‌తో కలిసి ప్రారంభించారు. నారాయణరెడ్డిని ప్రజాప్రతినిధులు, నాయకులు పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల సర్వతోముఖాభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందించి అమలు చేస్తుందన్నారు. మేరళ్లగడ్డ తండాకు బీటీ రోడ్డు నిర్మాణం చేయిస్తానని, వెంకటాపూర్‌కు బస్సు సౌకర్యం కల్పిస్తానని తెలిపారు. గ్రామస్థుల కోరిక మేరకు ముదిరాజ్‌ భవన నిర్మాణానికి రూ.5లక్షలు, ఎస్సీ కమ్యూనిటీ హాల్‌ ప్రహరీ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. వైస్‌ ఎంపీపీ శ్రీనివా్‌సరెడ్డి, ఎంపీటీసీలు రమేశ్‌, సుధాకర్‌రెడ్డి, సునీత సుదర్శన్‌రెడ్డి, ఎంపీడీవో శ్రీకాంత్‌, డీఈఈ శ్రీనివా్‌సలు, ఏఈలు విద్యాసాగర్‌, రవితేజ, ఆమనగల్లు బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు నర్సింహ, కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ లక్ష్మీదేవిరఘురాములు, నాయకులు మిట్టపల్లి అంజయ్య గుప్త, మోహన్‌రెడ్డి, అజీం, శ్రీశైలం, భగవాన్‌ రెడ్డి, తదితరులున్నారు.

Updated Date - Jan 12 , 2024 | 11:59 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising