ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అణగారిన కులాలకు రాజ్యాధికారమే లక్ష్యం

ABN, Publish Date - Nov 03 , 2024 | 11:49 PM

బీసీ, ఎస్సీ, ఎస్టీ అణగారిన కులాలకు రాజ్యాధికారం సాధించడమే డీఎ్‌సపీ(ధర్మ సమాజ్‌ పార్టీ) లక్ష్యమని రాష్ట్ర అఽధ్యక్షుడు డాక్టర్‌ విశారదన్‌ మహరాజ్‌ అన్నారు.

మాట్లాడుతున్న డాక్టర్‌ విశారదన్‌ మహరాజ్‌

420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ

నియంత పాలన సాగిస్తున్న సీఎం రేవంత్‌

ఈనెల 5 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 15 వేల కిలోమీటర్ల పాదయాత్ర

డీఎ్‌సపీ రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్‌ మహరాజ్‌

ఆదిభట్లలో మహా సమ్మేళనం

ఆదిభట్ల, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి) : బీసీ, ఎస్సీ, ఎస్టీ అణగారిన కులాలకు రాజ్యాధికారం సాధించడమే డీఎ్‌సపీ(ధర్మ సమాజ్‌ పార్టీ) లక్ష్యమని రాష్ట్ర అఽధ్యక్షుడు డాక్టర్‌ విశారదన్‌ మహరాజ్‌ అన్నారు. ఆదిభట్ల మున్సిపాలిటీ కొంగరకలాన్‌లోని కల్వకోలు భూపాల్‌రెడ్డి గార్డెన్‌లో ఆదివారం పార్టీ రాష్ట్రస్థాయి కార్యకర్తల మహాసమ్మేళనంలో భాగంగా బీసీ ఉద్యమం, విద్య, వైద్యంపై వైజ్ఞానిక అంశాలపై ఒక్క రోజు సదస్సునిర్వహించారు. ఆయా అంశాలపై వక్తలు మాట్లాడారు. అనంతరం డీఎ్‌సపీ రాష్ట్ర కార్యదర్శి బరిగల దుర్గా ప్రసాద్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విశారదన్‌మహరాజ్‌ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు లక్ష్యాలు నెరవేరలేదని, పేదలు అణగారిన వర్గాల జీవితాలలో ఏ మార్పు రాలేదన్నారు. 420 హామీలు ఇచ్చి కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ఆరు గ్యారెంటీలు అమలు చేయడంలో విఫలమైందన్నారు. సీఎం నియంత పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై డీఎ్‌సపీ యుద్ధ ప్రకటిస్తుందని పేర్కొన్నారు. హామీల అమలు కోసం రాష్ట్ర వ్యాప్తంగా 15వేల కిలోమీటర్ల మహా పాదయాత్ర చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈనెల 5న ఆదిలాబాద్‌ నుంచి ప్రారంభించే ఈ యాత్ర 2028 వరకు కొనసాగుతుందన్నారు. డీఎ్‌సపీ అధికారంలోకి వస్తే విద్య, వైద్యం ఉచితంగా అందించడమే కాకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలలో అమెరికాలాంటి ఉన్నత ప్రమాణాలు కలిగిన స్కూళ్లను నిర్మిస్తామన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఈశ్వరయ్య మాట్లాడుతూ ప్రజల హక్కులను హరిస్తూ నియతృత్వ పాలన సాగిస్తున్న పాలకులపై న్యాయ, ధర్మ పోరాటం చేయాలన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీల వర్గీకరణ అవసరమని, అవి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేయాలన్నారు. కేవలం రాష్ర్టాలు మాత్రమే చేయాలనడం సుప్రీం కోర్టు చెప్పడం సరికాదన్నారు. కార్యక్రమంలో ఎంవీ ఫౌండేషన్‌ జాతీయ కన్వీనర్‌ ఆర్‌. వెంకట్‌రెడ్డి, ధర్మ సమాజ్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శులు దుర్గాప్రసాద్‌, అన్నెల లక్ష్మణ్‌, హరీష్‌ గౌడ్‌, వినోద్‌ యాదవ్‌, రాఘవేంద్ర, రెహమాన్‌, సుమన్‌, శ్రీకాంత్‌, కార్తీక్‌, రవీందర్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 03 , 2024 | 11:49 PM