ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంట

ABN, Publish Date - Nov 28 , 2024 | 11:38 PM

ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ జంట బషీరాబాద్‌ పోలీసులను ఆశ్రయించింది. ఎస్‌ఐ గఫార్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

బషీరాబాద్‌, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ జంట బషీరాబాద్‌ పోలీసులను ఆశ్రయించింది. ఎస్‌ఐ గఫార్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని మంతన్‌గౌడ్‌ గ్రామానికి చెందిన యువకుడు జాదవ్‌ శ్రీకాంత్‌, బషీరాబాద్‌కు చెందిన యవతి ఠాగూరు నాగుబాయికి పాఠశాలలో చదివే రోజుల నుంచి పరిచయం ఉంది. ఈ క్రమంలో యువతి కుటుంబం కొన్నేళ్ల కిందట హైదరాబాద్‌కు వలస వెళ్లి అక్కడే ఉంది. ఇటీవల యువకుడు శ్రీకాంత్‌ హైదరాబాద్‌లోనే ఆటో నడిపేవాడు. ఈ క్రమంలో ఇరువురు హైదరాబాద్‌లో కలుసుకుని ఒకరినొకరు ప్రేమించుకున్నారు. యువతి కుటుంబీకులు వీరి పెళ్లికి అభ్యంతరం చెప్పడంతో ఈనెల 25వ తేదీన ఇంట్లో నుంచి పారిపోయి ఇరువురు పెళ్లి చేసుకున్నారు. యువతి కుటుంబీకుల నుంచి బెదిరింపులు రావడంతో చేసేదేమి లేక పోలీసులను ఆశ్రయించారు. ఇరు కుటుంబాల తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్‌ ఇస్తామని ఎస్‌ఐ వెల్లడించారు.

Updated Date - Nov 28 , 2024 | 11:38 PM