ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

బ్రిడ్జిపై నిలిచిన బస్సు.. ప్రయాణికుల అవస్థలు

ABN, Publish Date - Apr 04 , 2024 | 12:19 AM

ఓ ఆర్టీసీ బస్సు వికారాబాద్‌ బ్రిడ్జిపై ఒక్కసారిగా నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. దాదాపు గంటపాటు బ్రిడ్జిపై రాకపోకలు నిలిచిపోయాయి.

ట్రాఫిక్‌లో చిక్కుకున్న అంబులెన్స్‌

గంటసేపు రాకపోకలకు ఇబ్బంది

వికారాబాద్‌, ఏప్రిల్‌ 3 : ఓ ఆర్టీసీ బస్సు వికారాబాద్‌ బ్రిడ్జిపై ఒక్కసారిగా నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. దాదాపు గంటపాటు బ్రిడ్జిపై రాకపోకలు నిలిచిపోయాయి. అదే సమయంలో తాండూరు నుంచి వెళ్లే ఓ అంబులెన్స్‌ కూడా ట్రాఫిక్‌లో ఇరుక్కుపోవడంతో పేషంట్‌ను సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లలేని పరిస్థితి నెలకొంది. పేషంట్‌ పరిస్థితి సీరియస్‌గా ఉందని.. దారి ఇవ్వాలని కోరినా ఏం చేయలేని దుస్థితి. ఓ హోంగార్డు ముందుగా అక్కడికి చేరుకుని వాహనాలను ముందుకు పంపే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. క్రమ పద్దతిలో వెళ్లాల్సిన ప్రయాణికులు సైతం ఓవర్‌ టేక్‌ చేసేందుకు చూడడంతో ట్రాఫిక్‌ సమస్య మరింత ఎక్కువైంది. బస్సు బ్రేక్‌ డౌన్‌ అవ్వడంతో గంటసేపు ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందికి గురయ్యారు. కాలం చెల్లిన బస్సులతో తిప్పలు తప్పడం లేదని ప్రజలు చర్చించుకుంటున్నారు.

Updated Date - Apr 04 , 2024 | 12:19 AM

Advertising
Advertising