ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కీచక అధ్యాపకుడు!

ABN, Publish Date - Oct 29 , 2024 | 12:12 AM

విద్యాబుద్ధులు చెప్పాల్సిన అధ్యాపకుడు విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ప్రజాసంఘాలు స్పందించడంతో కటకటాల పాలయ్యాడు.

విద్యార్థినుల పట్ల అసభ్య ప్రవర్తన

-పెద్దేముల్‌ కళాశాలలో ప్రజాసంఘాల ధర్నా

-పోలీసులకు ఫిర్యాదు.. పోక్సో కేసు నమోదు

పెద్దేముల్‌, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): విద్యాబుద్ధులు చెప్పాల్సిన అధ్యాపకుడు విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ప్రజాసంఘాలు స్పందించడంతో కటకటాల పాలయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. వికారాబాద్‌ జిల్లా పెద్దేముల్‌ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో హిందీ అధ్యాపకుడిగా పనిచేస్తున్న జమీల్‌ ఇటీవలే ప్రభుత్వ అధ్యాపకుడిగా రెగ్యులరైజ్‌ అయ్యాడు. కొన్ని రోజులుగా విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవరిస్తున్నాడనే విషయం బయటకు వచ్చింది. దీంతో ఆగ్రహానికి గురైన ప్రజాసంఘాలు, యువజనసంఘాల సభ్యులు సోమవారంకళాశాల ఆవరణలో ఆందోళనకు దిగారు. అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న అధ్యాపకుడిని శిక్షించాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు వెంటనే అతడిపై కేసునమోదు చేసి అరెస్టు చేయాలని కోరారు. విషయం తెలిసి రాష్ట్ర ప్రిన్సిపల్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షురాలు కొమ్ము రజిత, జిల్లా నోడల్‌ ఆఫీసర్‌ అక్కడికి చేరుకుని విచారణ జరిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు కళాశాల వద్దకు చేరుకుని ధర్నా చేస్తున్న వారిని సముదాయించారు. ఫిర్యాదు చేస్తే తాము చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పోలీసులు ముందు జాగ్రత్తచర్యగా జమీల్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రజాసంఘాలు, యువజన సంఘాల సభ్యులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధిత విద్యార్థిని కూడా రాతపూర్వక ఫిర్యాదు చేయడంతో జమీల్‌పై లైంగిక వేధింపుల, పోక్సోకేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ గిరి తెలిపారు.

Updated Date - Oct 29 , 2024 | 12:12 AM