సదర్ సంబురం
ABN, Publish Date - Nov 01 , 2024 | 11:23 PM
దీపావళి సందర్భంగా నిర్వహించిన సదర్ ఉత్సవాల్లో దున్నపోతుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. గురువారం ఘట్‌కేసర్‌లోని అంబేడ్కర్ చౌరస్తాలో శ్రీకృష్ణ భగవానునికి ప్రత్యేక పూజులు చేసి ఉత్సవాలను ప్రారంభించారు.
సదర్ సంబురం
ఘట్‌కేసర్/మేడ్చల్ టౌన్,నవంబరు1 (ఆంధ్రజ్యోతి): దీపావళి సందర్భంగా నిర్వహించిన సదర్ ఉత్సవాల్లో దున్నపోతుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. గురువారం ఘట్‌కేసర్‌లోని అంబేడ్కర్ చౌరస్తాలో శ్రీకృష్ణ భగవానునికి ప్రత్యేక పూజులు చేసి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఘట్‌కేసర్ మున్సిపల్ చైర్ పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ మాట్లాడుతూ సదరు పండుగ యాదవులకు పశువులపై ఉన్న ప్రేమానురాగాలను తెలియజేస్తుందన్నారు. ప్రతి సంవత్సరం దీపావళి రోజున యాదవులు కలిసికట్టుగా ఈ ఉత్సవం ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం పలువురు యాదవులు తమ దున్నపోతులను విన్యాసాలు నిర్వహించారు.
పూడురులో వైభవంగా..
అలాగే మేడ్చల్ మున్సిపాలిటీ పూడూరు గ్రామంలో యాదవ సంఘం ఆద్య్రర్యంలో సదర్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. దున్నపోతులను అందంగా అలంకరించి మల్లన్న ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేడుకలను ప్రారంభించారు. జిల్లా గ్రంఽథాలయ మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు దయానంద్ యాదవ్, ఎల్లంబాబు యాదవ్‌ను సత్కరించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ స్వామి యాదవ్, మాజీ సర్పంచ్ బాబు యాదవ్ పాల్గొన్నారు.
Updated Date - Nov 01 , 2024 | 11:23 PM