ఆర్పీలకు రూ.20 వేల వేతనమివ్వాలి
ABN, Publish Date - Jan 18 , 2024 | 11:29 PM
పట్టణ పేదరిక నిర్మూలనా సంస్థ (మెప్మా) ఆర్పీలకు పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని, నెలకు రూ.20 వేల వేతనం ఇవ్వాలని మెప్మా ఆర్పీలు గురువారం ఇబ్రహీంపట్నం మున్సిపల్ కమిషనర్ రవీందర్ సాగర్‌కు వినతిపత్రం అందజేశారు. 2023 జూన్ నుంచి తమకు వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు.
ఇబ్రహీంపట్నం, జనవరి 18: పట్టణ పేదరిక నిర్మూలనా సంస్థ (మెప్మా) ఆర్పీలకు పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని, నెలకు రూ.20 వేల వేతనం ఇవ్వాలని మెప్మా ఆర్పీలు గురువారం ఇబ్రహీంపట్నం మున్సిపల్ కమిషనర్ రవీందర్ సాగర్‌కు వినతిపత్రం అందజేశారు. 2023 జూన్ నుంచి తమకు వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. అక్టోబర్‌లో తమ వేతనాలను రూ.4 వేల నుంచి రూ.6 వేలకు పెంచారని గుర్తుచేశారు. ఆర్పీలకు డ్రెస్‌కోడ్ అమలు చేయాలని, పది లక్షల రూపాయాల ఆరోగ్య బీమా, పది లక్షల రూపాయల ప్రమాద బీమా అందించాలని వారు కోరారు. మెప్మా ఆర్పీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షురాలు బి.హంసమ్మ, నాయకులు సుజాత, శ్రీలత. అండాలు తదితరులున్నారు.
Updated Date - Jan 18 , 2024 | 11:29 PM