గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి : కలెక్టర్
ABN, Publish Date - Jan 18 , 2024 | 11:23 PM
ఈ నెల 26న కలెక్టరేట్ వద్ద నిర్వహించే గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని, అందుకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ గౌతమ్ అన్నారు.
మేడ్చల్, జనవరి 18(ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : ఈ నెల 26న కలెక్టరేట్ వద్ద నిర్వహించే గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని, అందుకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ గౌతమ్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. గణతంత్ర దిన వేడుకల్లో జాతీయతా భావం ఉట్టిపడేలా నిర్వహించాలన్నారు. జాతీయ పతాకావిష్కరణ, పోలీసుల గౌరవ వందనం కార్యక్రమాలు పోలీ్‌సశాఖ ఆధ్వర్యంలో చేపట్టాలన్నారు. కలెక్టరేట్ ఆవరణలోని పరిసరాల పరిశుభ్రత, పారిశుధ్య నిర్వహణ అంశాలపై మున్సిపల్ కమిషనర్లకు సూచనలు చేశారు. ఉద్యానవనశాఖ ఆధ్వర్యంలో వేదిక పుష్పాలంకరణతో అందంగా ఉండేలా చూడాలన్నారు. జిల్లా ప్రజాప్రతినిధులు, ముఖ్య అతిథులకు ఆహ్వానపత్రాలను అందజేయాలని సూచించారు. జిల్లాలో ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందించే కార్యక్రమాలను రెవెన్యూ శా ఖ పర్యవేక్షించాలన్నారు. జిల్లా ప్రగతిపై రూపొందించే ముసాయిదా కాపీ ఏర్పాట్లను సీపీఓ ఆధ్వర్యంలో తయారు చేయాల్సిందిగా కలెక్టర్ గౌతమ్ పేర్కొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ విద్యాశాఖ చేపట్టాలని, వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, మందులతో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. విద్యుత్ శాఖ అధికారులు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. సమావేశంలో డీఆర్వో హరిప్రియ, ఆర్డీఓలు రాజే్‌షకుమార్, శ్యామ్‌ప్రకాష్, కలెక్టరేట్ ఏవో రామ్మోహన్, అధికారులు పాల్గొన్నారు.
రిపబ్లిక్ డే వేడులకు అన్ని ఏర్పాట్లు చేయాలి : కలెక్టర్
వికారాబాద్ : ఈ నెల 26న నిర్వహించే గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. గురువారం గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే గణతంత్ర దినోత్సవ కార్యక్రమానికి ఏర్పాట్లు చేయడంతో పాటు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై శకటాలు, స్టాళ్లను పెట్టాలన్నారు. ప్రభుత్వ శాఖల ద్వారా లబ్ధిదారులకు అందించే యూనిట్లను ఎగ్జిబిట్ చేయాలన్నారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహణకు ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రొటోకాల్ ప్రకారం కార్యక్రమానికి అందరికీ ఆహ్వానాలు అందజేయాలన్నారు. ఉత్తమ సేవలందించిన అధికారులు, ఉద్యోగులకు ప్రశంసాపత్రాలిచ్చేందుకు జాబితాను రూపొందించాలని సూచించారు. కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, వికారాబాద్ ఆర్డీవో విజయ కుమారి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Jan 18 , 2024 | 11:23 PM