ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పారిశుధ్యంలో భాగస్వాములవ్వాలి

ABN, Publish Date - Sep 21 , 2024 | 11:56 PM

సంపూర్ణ పారిశుధ్యంలో ప్రతీఒక్కరు భాగస్వాములు కావాలని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి శ్రీలత అన్నారు. శనివారం దండుమైలారం ఉన్నత పాఠశాలలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా టీచర్లు ప్రతిజ్ఞ చేయిచారు. రోజువారీ పారిశుధ్య పనులు ఎలా జరుగుతున్నాయని కార్యదర్శి శివకుమార్‌ను అడిగి తెలుసుకున్నారు.

ఇబ్రహీంపట్నం : దండుమైలారం పాఠశాలలో ప్రతిజ్ఞ చేయిస్తున్న డీఆర్డీవో శ్రీలత

స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో డీఆర్డీవో శ్రీలత

ఇబ్రహీంపట్నం, సెప్టెంబరు 21: సంపూర్ణ పారిశుధ్యంలో ప్రతీఒక్కరు భాగస్వాములు కావాలని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి శ్రీలత అన్నారు. శనివారం దండుమైలారం ఉన్నత పాఠశాలలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా టీచర్లు ప్రతిజ్ఞ చేయిచారు. రోజువారీ పారిశుధ్య పనులు ఎలా జరుగుతున్నాయని కార్యదర్శి శివకుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. ఎంపీడీవో వెంకటమ్మ, హెచ్‌ఎం గోవర్దన్‌, ఏపీడీ సక్రియానాయక్‌, ఏపీవో తిరుపతాచారి తదితరులున్నారు.

తలకొండపల్లి : మండల కేంద్రంలోని కేజీబీవీ ఎదుట మానవహారం నిర్వహించారు. విద్యార్థులు, మహిళా సంఘాల సభ్యులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఎంపీడీవో శ్రీకాంత్‌ ర్యాలీని ప్రారంభించారు. ఏపీఎం శ్రీదేవి, గ్రామ సంఘాల అధ్యక్షులు, ఎంఈవో, ఇతర శాఖల అదికారులు పాల్గొన్నారు.

కేశంపేట : పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం చేకూరుతుందని ఎంపీడీవో రవిచంద్రకుమార్‌ రెడ్డి అన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో చెత్తాచెదారం తొలగించారు. పిచ్చి మొక్కలు, కలుపు గడ్డిని తీసివేశారు. ఎంపీడీవో మండలంలోని కోనాయలపల్లి, చౌలపల్లిలో శ్రమదానం చేపట్టారు. ఎంపీవో కిష్టయ్య, కార్యదర్శులు పాల్గొన్నారు.

చౌదరిగూడ : గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలంటే ప్రజలందరి సహకారం అవసరమని ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. శనివారం జిల్లేడ్‌ చౌదరిగూడ మండల కేంద్రంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. తహసీల్ధార్‌ జగదీశ్వర్‌, జీహెచ్‌ఎం సునీతతో పాటు ఉపాధ్యాయులు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

పరిసరాల పరిశుభ్రతకు పాటుపడాలి

శంకర్‌పల్లి : పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌ తెలిపారు. 11వ వార్డులో శనివారం త్రిపుల్‌ఆర్‌ (రెడ్యూస్‌, రీయూజ్‌, రీసైకిల్‌) సెంటర్‌ వినియోగం గురించి అవగాహన సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పట్టణ పరిధిలో చెత్తను తగ్గించే విధంగా సహకరించాలని కోరారు. ప్లాస్టిక్‌ను వినియోగించకుండా ఉండటం, మట్టిలో కలిసిపోయే వస్తువులను వినియోగించాలని సూచించారు. మెప్మా ఆర్పీలు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Sep 21 , 2024 | 11:57 PM