వైద్యాధికారులు సమయపాలన పాటించాలి
ABN, Publish Date - Jan 18 , 2024 | 11:30 PM
వైద్యాధికారులు సమయపాలన పాటించాలని లేదంటే కఠినచర్యలు తప్పవని డిప్యూటీ డీఎంహెచ్‌వో దామోదర్ హెచ్చరించారు. గురువారం చేవెళ్లలో వైద్యాధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు.
చేవెళ్ల, జనవరి 18 : వైద్యాధికారులు సమయపాలన పాటించాలని లేదంటే కఠినచర్యలు తప్పవని డిప్యూటీ డీఎంహెచ్‌వో దామోదర్ హెచ్చరించారు. గురువారం చేవెళ్లలో వైద్యాధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గర్భిణీలు, బాలింతల విషయంలో సంరక్షణ, పర్యవేక్షణ చేయాలన్నారు. శిశు పోషణ, రక్షణలో భాగంగా సకాలంలో టీకాల నిర్వహణ, ఫిర్యాదులు వస్తే ఇంటింటి సర్వే చేయాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులు ఎక్కువగా జరిగేవిధంగా చూడాలన్నారు. సమయపాలన పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. సమావేశంలో సిహెచ్‌వోలు సంతోష, గోపాల్‌రెడ్డి, సుదర్శన్, బలరాం వైద్యులు, వైద్య సిబ్బంది ఉన్నారు.
Updated Date - Jan 18 , 2024 | 11:30 PM