కడ్తాల్ జీపీ అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్!
ABN, Publish Date - Sep 26 , 2024 | 12:17 AM
కడ్తాల్ గ్రామపంచాయతీ అఽభివృద్ధికి మాస్టర్‌ప్లాన్ రూపకల్పనలో భాగంగా ఇండికేటివ్‌ల్యాండ్ యూజ్ ప్లాన్‌కు పట్టణాభివృద్ధి శాఖ అధికారులు ముసాయిదా రూపకల్పన చేస్తున్నారు.
ఐఎల్‌యూపీ రూపకల్పనలో డీటీసీపీ అధికారులు
కడ్తాల్, సెప్టెంబరు 25 : కడ్తాల్ గ్రామపంచాయతీ అఽభివృద్ధికి మాస్టర్‌ప్లాన్ రూపకల్పనలో భాగంగా ఇండికేటివ్‌ల్యాండ్ యూజ్ ప్లాన్‌కు పట్టణాభివృద్ధి శాఖ అధికారులు ముసాయిదా రూపకల్పన చేస్తున్నారు. భూవినియోగ రూపకల్పన ఐఎల్‌యూపీలో భాగంగా కడ్తాల సమాచారాన్ని కొంతకాలంగా సేకరిస్తున్నారు. కడ్తాల్ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని పక్కగా సమగ్రంగా ప్రణాళికల రూపకల్పన చేయాల్సి ఉంది. బుధవారం పట్టణాభివృద్ధి శాఖ అసిస్టెంట్ రీజినల్ డైరెక్టర్ సత్యభామ టీపీవో సువర్ణ గ్రామపంచాయతీ కార్యాలయానికి చేరుకొని సమాచారాన్ని సేకరించారు. గ్రామ రెవెన్యూ మ్యాప్‌ను పరిశీలించారు. కాగా, అధికారులు స్థానిక మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు ఎవరికీ సమాచారం ఇవ్వకుండా ఓ స్థానిక వెంచర్ ప్రతినిధులతో సమావేశం కావడం, వివరాలు సేకరించడం వివాదాస్పదంగా మారింది. పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వ చెరువు, కుంటలను ఆక్రమించిన సంస్థ ప్రతినిధులతో అధికారులు వివరాలు సేకరించడం ఏమిటని కడ్తాల్ మాజీ వైస్ ఎంపీపీ ఆనంద్ అభ్యంతరం తెలిపారు. దాంతో వెంచర్ ప్రతినిధులు అక్కడి నుంచి జారుకున్నారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోతానని ఆనంద్ పేర్కొన్నారు.
Updated Date - Sep 26 , 2024 | 12:17 AM