ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మానవత్వం చాటిన ఇబ్రహీంపట్నం పోలీసులు

ABN, Publish Date - Jan 23 , 2024 | 12:40 AM

మతి స్థిమితం సరిగాలేని ఓ వృద్ధురాలిని సోమవారం ఇబ్రహీంపట్నం పోలీసులు చేరదీసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. బడంగ్‌పేట్‌ కార్పొరేషన్‌ బాలాపూర్‌కు చెందిన నేనావత్‌ నవీన్‌ వద్దఉంటున్న వాళ్ల నాయనమ్మ చండి(70)కు కొంతకాలంగా మతి స్థిమితం సరిగా ఉండటం లేదు.

మతి స్థిమితం సరిగాలేని వృద్ధురాలిని చేరదీసి కుటుంబ సభ్యులకు అప్పగింత

ఇబ్రహీంపట్నం, జనవరి 22: మతి స్థిమితం సరిగాలేని ఓ వృద్ధురాలిని సోమవారం ఇబ్రహీంపట్నం పోలీసులు చేరదీసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. బడంగ్‌పేట్‌ కార్పొరేషన్‌ బాలాపూర్‌కు చెందిన నేనావత్‌ నవీన్‌ వద్దఉంటున్న వాళ్ల నాయనమ్మ చండి(70)కు కొంతకాలంగా మతి స్థిమితం సరిగా ఉండటం లేదు. ఇబ్రహీంపట్నం పరిధి ఉప్పరిగూడ వెళ్లే రోడ్డులో ఉన్న ఆమెను గస్తీ చేస్తున్న ఎస్సై రామకృష్ణ, కానిస్టేబుళ్లు ప్రేమలత, రాజులు ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారు. భోజనం పెట్టి ఆమె వద్ద ఉన్న సంచిలో దొరికిన ఫోన్‌నంబర్‌ ఆధారంగా మనవడు నవీన్‌కు ఫోన్‌ చేశారు. స్టేషన్‌ వచ్చిన మనవడికి ఆమెను అప్పగించారు. మూడు రోజుల క్రితం ఆమె ఇంటినుంచి వెళ్లిందని నవీన్‌ తెలిపాడు.

Updated Date - Jan 23 , 2024 | 08:25 AM

Advertising
Advertising