సర్పంచ్‌ల బిల్లులు చెల్లించేందుకు కృషి
ABN, Publish Date - Jan 29 , 2024 | 11:51 PM
గత ప్రభుత్వ హయాంలో సర్పంచ్‌లు అప్పులు చేసి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసినా నేటికీ ప్రభుత్వం బి ల్లులు చెల్లించ లేదని, కొత్త ప్రభుత్వంలో వారికి బిల్లులు చెల్లించేలా కృషిచేస్తానని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు.
షాద్‌నగర్ రూరల్, జనవరి 29: గత ప్రభుత్వ హయాంలో సర్పంచ్‌లు అప్పులు చేసి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసినా నేటికీ ప్రభుత్వం బి ల్లులు చెల్లించ లేదని, కొత్త ప్రభుత్వంలో వారికి బిల్లులు చెల్లించేలా కృషిచేస్తానని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ఫరూఖ్‌నగర్ మండల సర్వసభ్య సమావేశం సోమవారం ఎంపీపీ ఖాజా ఇద్రిస్ అధ్యక్షతన నిర్వహించారు. పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బిల్లులు రాలేదని సర్పంచ్‌లు ఆవేదన చెందవద్దని, పదవీ కాలం ముగు స్తున్నందున వారినే పర్సన్ ఇన్‌చార్జిలుగా కొనసా గించాలని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి పనిచేస్తేనే మంచి ఫలితాలు వస్తాయన్నారు. ప్రజలకు సేవకులుగా పనిచేయాలని తెలిపారు. తాను రాజకీయ కక్షలకు తావివ్వనన్నారు. పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు గ్రామ సమస్యలపై సభ లో లేవనెత్తారు. వాటి పరిష్కారానికి చర్యలు తీసు కోవాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. సమావేశంలో వైస్‌ఎంపీపీ మౌనిక, జెడ్పీటీసీ వెంకట్‌రాంరెడ్డి, ప్యాక్స్ చైర్మన్ బక్కన్న, ఎంపీడీఓ వినయ్‌కుమార్, తహసీల్దార్ పార్థసారథి పాల్గొన్నారు.
మౌలిక సదుపాయాలు కల్పిస్తాం
గ్రామాల్లో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషిచేస్తానని ఎమ్మెల్యే వీర్లపల్లి శం కర్ అన్నారు. కుందేలుకంటతండాలో పంచాయతీ భవనం, బూర్గులలో పశువైద్య శాలను ప్రారంభించారు. సామాన్యులకు అందుబాటులో కాంగ్రెస్ పా లన ఉంటుందన్నారు. అంతకు ముందు కాంగ్రెస్ జెండాను ఎగరవేశారు. జెడ్పీటీసీ వెంకట్‌రాంరెడ్డి, సర్పంచ్‌లు అరుణశివకుమార్, రవి, బాల్‌రాజ్‌గౌడ్, శ్రీకాంత్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
మహిళా అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయం
నందిగామ: మహిళా అభ్యున్నతే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. నందిగామ మండలం అప్పారెడ్డిగూడలో జెడ్పీ నిధులు రూ.20లక్షలతో నిర్మించిన మహిళా సమాఖ్య భవనాన్ని ఎమ్మెల్యే, ఎంపీపీ ప్రియాంక, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రారంభించారు. ఈ భవనం కోసం గ్రామానికి రవీందర్‌రెడ్డి స్థలం విరాళంగా ఇచ్చారు. స్థల దాతను ఎమ్మెల్యే సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్ జేకే. నర్సిం లు, ఎంపీటీసీ లతశ్రీశైలం, ఉపసర్పంచ్ సీతారాములు, క్రిష్ణ, కుమార్‌గౌడ్ పాల్గొన్నారు.
Updated Date - Jan 29 , 2024 | 11:51 PM