సీసీఐ కొనుగోలు కేంద్రాల్లోనే పత్తి విక్రయించాలి
ABN, Publish Date - Oct 27 , 2024 | 11:50 PM
ఆమనగల్లు వ్యవసాయ మార్కెట్ పరిధిలోని ఆమనగల్లు, కడ్తాల, మాడ్గుల, తలకొండపల్లి మండలాల రైతులు పత్తి పంటను సీసీఐ కోనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి పి.శ్రీనివా్‌సరెడ్డి కోరారు. రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని ఆయన సూచించారు.
ఆమనగల్లు, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): ఆమనగల్లు వ్యవసాయ మార్కెట్ పరిధిలోని ఆమనగల్లు, కడ్తాల, మాడ్గుల, తలకొండపల్లి మండలాల రైతులు పత్తి పంటను సీసీఐ కోనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి పి.శ్రీనివా్‌సరెడ్డి కోరారు. రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని ఆయన సూచించారు. ఆమనగల్లు మార్కెట్‌యార్డ్‌లో ఆదివారం శ్రీనివా్‌సరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆమనగల్లు మార్కెట్ పరిధిలో మూడు పత్తి మిల్లులను సీసీఐ కొనుగోలు కేంద్రాలుగా ప్రభుత్వం నోటిఫై చేసిందన్నారు. నవంబరు మొదటి వారంలో ఆకుతోటపల్లి, పోలెపల్లి గేటు, తలకొండపల్లి పత్తి మిల్లులలో సీసీఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. పత్తికి క్వింటాల్‌కు రూ.7,521 ప్రభుత్వం ధర ప్రకటించిందని, 8 శాతం తేమ ఉన్నప్పుడే ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర చెల్లించడం జరుగుతుందని, తేమ శాతం పెరిగినచో మద్దతు ధర తగ్గుతుందన్నారు. 9 శాతంనకు రూ.7,445.79, పది శాతానికి రూ.7,370.58, 11 శాతానికి రూ.7,295.37, 12 శాతానికి రూ.7,220.16 చెల్లిస్తారని శ్రీనివా్‌సరెడ్డి వివరించారు. పత్తిలో తేమ శాతం 12కంటే ఎక్కువ ఉన్నట్లైతే సీసీఐ కొనుగోలు చేయదని తెలిపారు. రైతులు తమ పత్తిని తేమ శాతం తక్కువగా ఉండేలా ఆరబెట్టి, చెత్తాచెదారం ్తలేకుండా శుద్ధి చేసి సమీపంలోని కొనుగోలు కేంద్రంలో విక్రయించి మద్దతు ధర పొందాలని శ్రీనివాస్ రెడ్డి కోరారు.
Updated Date - Oct 27 , 2024 | 11:50 PM