బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడి కార్ల ర్యాలీ
ABN, Publish Date - Jan 29 , 2024 | 11:58 PM
బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడిగా నియామకమైన శంషాబాద్‌కు చెందిన సేవెళ్ల మహేందర్ సోమవారం పట్టణ కేంద్రంలో కార్లతో ర్యాలీ నిర్వహించి నగరంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ఊరేగింపుగా వెల్లారు.
శంషాబాద్, జనవరి 29 : బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడిగా నియామకమైన శంషాబాద్‌కు చెందిన సేవెళ్ల మహేందర్ సోమవారం పట్టణ కేంద్రంలో కార్లతో ర్యాలీ నిర్వహించి నగరంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ఊరేగింపుగా వెల్లారు. శంషాబాద్ పోచమ్మ దేవాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ హనుమాన్‌బస్తీ, రైల్వేకమాన్, సిద్దప్పరోడ్డు, మహవీర్‌బిల్డర్స్, బస్టాండు చౌరస్తా, అంబేద్కర్‌చౌరస్తా, గుండా సాగింది. కార్యకర్తలు బాణసంచా కాల్చి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మహేందర్ మాట్లాడుతూ బీజేవైఎంకు రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు తెస్తానని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపుకు కృషిచేస్తానన్నారు. బీజేపీ సీనియర్ నాయకుడు డాక్టర్ ప్రేమ్‌రాజ్, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jan 29 , 2024 | 11:58 PM