తాండూరులో బీజేపీకి బలమైన కేడర్
ABN, Publish Date - Oct 27 , 2024 | 11:26 PM
మండలంలో భారతీయ జనతా పార్టీకి బలమైన కేడర్ ఉందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు యు.రమేష్ అన్నారు.
తాండూరు రూరల్, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): మండలంలో భారతీయ జనతా పార్టీకి బలమైన కేడర్ ఉందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు యు.రమేష్ అన్నారు. మండల పరిధిలోని చింతామణిపట్నం, చెంగోల్, పర్వతాపూర్, గౌతాపూర్ గ్రామాల్లో ఆదివారం బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు ప్రభుశంకర్, సభ్యత్వ ప్రముఖ్ ఆంజనేయులు ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యు.రమేష్ మాట్లాడుతూ.. గ్రామ గ్రామాన యువత పెద్దఎత్తున బీజేపీ సభ్యత్వాన్ని తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణాముదిరాజ్, ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు శాంతకుమార్, నాయకులు వడ్ల విజయ్‌కుమార్, కిరణ్, కుర్వ మల్లేష్, రవికుమార్, మల్లికార్జున్ పాల్గొన్నారు.
Updated Date - Oct 27 , 2024 | 11:28 PM