ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఒత్తిళ్లను అధిగమిస్తే ఉత్తమ ఫలితాలు

ABN, Publish Date - Jan 29 , 2024 | 11:46 PM

పదో తరగతి విద్యార్థులు ఒత్తిళ్లను అధిగమించి ప్రణాళిక, ఏకాగ్రతతో చదివితే ఉత్తమ ఫలితా లు సాధిస్తారని వ్యక్తిత్వవికాస నిపుణుడు గంప నాగేశ్వర్‌రావు, ఈ-అభ్యాస్‌ సీఈవో భువనగిరి, ఫణిపవన్‌శాస్త్రి, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు బీరప్ప, రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కార్యదర్శి వెంకటయ్య అన్నారు.

ప్రేరణ తరగతుల్లో పాల్గొన్న గంప నాగేశ్వర్‌రావు, తదితరులు

ఆమనగల్లు, జనవరి 29: పదో తరగతి విద్యార్థులు ఒత్తిళ్లను అధిగమించి ప్రణాళిక, ఏకాగ్రతతో చదివితే ఉత్తమ ఫలితా లు సాధిస్తారని వ్యక్తిత్వవికాస నిపుణుడు గంప నాగేశ్వర్‌రావు, ఈ-అభ్యాస్‌ సీఈవో భువనగిరి, ఫణిపవన్‌శాస్త్రి, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు బీరప్ప, రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కార్యదర్శి వెంకటయ్య అన్నారు. ఆత్మవిశ్వాస మే విజయానికి సోపానం అన్నారు. ఆమనగల్లులోని భవానీ గార్డెన్‌లో సోమవారం ఆమనగల్లు, కడ్తాల, మాడ్గుల, తలకొండపల్లి, వెల్దం ద మండలాల టెన్త్‌ విద్యార్థులకు ప్రేరణ తరగతులను నిర్వహించారు. ట్రస్మా డివిజన్‌ కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ బాలాపూర్‌ శ్రీవాగ్దేవి జూనియర్‌ కళాశాల సహకారంతో ఏర్పాటు చేసిన ఈ తరగతులకు వీరంతా ముఖ్య అతిథులుగా హా జరయ్యారు. పదో తరగతి వార్షిక పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో విద్యార్థులు సమయాన్ని వృథా చేయకుండా స్వీయ ప్రణాళిక, పాఠ్యాంశ పునశ్చర ణ చేసుకోవాలన్నారు. ప్రతీ విద్యార్థి జీవితానికి టెన్త్‌ ఓ మైలురాయి వంటిదన్నారు. కష్టపడి తే పదిలో 10జీపీఏ సాధించొచ్చని సూ చించారు. ప్రేరణ తరగతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో ఉన్నత స్థానంలో రాణించాలని నాగేశ్వర్‌రావు, ఫణిపవన్‌ పేర్కొన్నారు. కార్యక్రమంలో డివిజన్‌ ట్రస్మా అధ్యక్షు డు శ్రీనివాసులు, జిల్లా కోశాధికారి చు క్క అల్లాజిగౌడ్‌, కోశాధికారి జె.ఆంజనేయులు, కార్యవర్గ సభ్యులు మహమూ ద్‌, అవ్వారి శివలింగం, వెంకన్న, తిరుమలేశ్‌, బీజు జోసెఫ్‌, జంగయ్య, శేఖర్‌, టీచర్లు నరేశ్‌, చలం, లింగం, వెంకటేశ్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Jan 29 , 2024 | 11:47 PM

Advertising
Advertising