‘గ్రామకంఠం’ ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలి
ABN, Publish Date - Jan 18 , 2024 | 11:27 PM
మండల పరిధిలోని గట్టిప్పలపలిలో అనుమతులు లేకుండా గ్రామకంఠం భూమిని ఆక్రమించి ఓ ప్రార్థనా మందిరాన్ని నిర్మిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎస్సీ రిజర్వేషన్ల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గురువారం తలకొండపల్లి తహాసీల్దార్, మండల పరిషత్ కార్యాలయాల ఎదుట నిరసన తెలిపారు.
తలకొండపల్లి, జనవరి 18: మండల పరిధిలోని గట్టిప్పలపలిలో అనుమతులు లేకుండా గ్రామకంఠం భూమిని ఆక్రమించి ఓ ప్రార్థనా మందిరాన్ని నిర్మిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎస్సీ రిజర్వేషన్ల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గురువారం తలకొండపల్లి తహాసీల్దార్, మండల పరిషత్ కార్యాలయాల ఎదుట నిరసన తెలిపారు. ఎస్సీ రిజర్వేషన్ల పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప్పుల నర్సింహ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆయా కార్యాలయాల ఎదుట నిరసన తెలిపి అనంతరం తహసీల్దార్ రంగారెడ్డి, ఎంపీడీవో శ్రీకాంత్‌లకు వినతిపత్రాలు అందజేశారు. అదేవిధంగా మతం మారి అంతకుముందు ఉన్న ఎస్సీ రిజర్వేషన్లు పొందుతున్న వారిని గుర్తించి వారికి బీసీ-సీ సర్టిఫికెట్లు ఇవ్వాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి అధికారులు చర్యలు తీసుకోకపోతే అందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని నర్సింహ పేర్కొన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి కాకి వినోద్, నియోజకవర్గ ఇంచార్జి బోయిన్‌పల్లి కృష్ణ, గట్టిప్పలపల్లి గ్రామ అధ్యక్షుడు దుబ్బ మల్లేశ్, నాయకులు రాజు, గణేశ్, శ్రీకాంత్, మహేశ్, మల్లెశ్, భరత్, అనిల్, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jan 18 , 2024 | 11:27 PM