ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మొక్కజొన్నకు బంగారు భవిష్యత్తు

ABN, Publish Date - Nov 07 , 2024 | 10:51 PM

మొక్కజొన్నకు బంగారు భవిష్కత్తు ఉందని రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని లుఽథియాన వ్యవసాయ శాస్త్రవేత ఎస్‌.ఎల్‌ జాట్‌ సూచించారు.

మొక్కజొన్న విత్తనాలు అందిస్తున్న శాస్త్రవేతలు

కేశంపేట, నవంబరు7(ఆంధ్రజ్యోతి): మొక్కజొన్నకు బంగారు భవిష్కత్తు ఉందని రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని లుఽథియాన వ్యవసాయ శాస్త్రవేత ఎస్‌.ఎల్‌ జాట్‌ సూచించారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, మొక్కజొన్న పరిశోధన కేంద్రం, జాతీయ మొక్కజొన్న పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో గురువారం మండల పరిధిలోని దేవునిగుడి తండాలో షెడ్యూల్‌ తెగల ఉపప్రణాళిక పథకంలో భాగంగా మొక్కజొన్న పంట సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్‌ శాస్త్రవేత ఎస్‌.ఎల్‌. జాట్‌ మాట్లాడుతూ పౌలీ్ట్రలో మొక్కజొన్న ప్రధాన భూమిక నిర్వహిస్తుందని తెలిపారు. పౌలీ్ట్ర అభివృద్ధికి ఉపయోగపడుతన్న మొక్కజొన్నకు బంగారు భవిత ఉందని వివరించారు. బీర్ల తయారీతో పాటు, పెట్రొల్‌లో కలిసే ఇథనాల్‌ తయరీలో ముడి సరుకుగా మొక్కజొన్నను ఉపయోగించే అంశాన్ని ప్రభుత్వం ఆలోచిస్తుందని వివరించారు. రైతులు కొంత ముందు చూపుతో మొక్కజొన్న వైపు మళ్లితే అధిక దిగుబడితో పాటు పెద్ద ఎత్తున లాభాలు పొందే అవకాశం ఉందని తెలిపారు. ప్రభుత్వం ట్రైబల్‌ స్కీం కింద రైతులకు డీహెచ్‌ఎం 117 రకం విత్తనాలను ఎకరాకు 8 కేజీలను ఉచితంగా అందించారు. కార్యక్రమంలో డాక్టర్‌ యం.వి. నాగేశ్‌, డాక్టర్‌ ఎన్‌. సునీల్‌, డాక్టర్‌ బి. మల్లయ్య, డాక్టర్‌ లక్ష్మి, సౌజన్య, వాణీశ్రీ, వై.ఎస్‌. పరమేశ్వరి, ఏఈవోలు రాజేశ్వరి, వినయ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 07 , 2024 | 10:51 PM