ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

President Droupadi Murmu : హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

ABN, Publish Date - Dec 18 , 2024 | 06:23 AM

శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌ చేరుకున్నారు. మంగళవారం సాయంత్రం 5.10 గంటలకు ప్రత్యేక విమానంలో హకీంపేట విమానాశ్రయానికి

స్వాగతం పలికిన గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ, సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌, అల్వాల్‌, మేడ్చల్‌, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌ చేరుకున్నారు. మంగళవారం సాయంత్రం 5.10 గంటలకు ప్రత్యేక విమానంలో హకీంపేట విమానాశ్రయానికి చేరుకున్న ఆమెకు.. గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ, సీఎం రేవంత్‌రెడ్డి ఘన స్వాగతం పలికారు. మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాల్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ(ఇన్‌చార్జ్‌ డీజీపీ) రవిగుప్తా, త్రివిధ దళాలకు చెందిన అధికారులతోపాటు మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌ గౌతమ్‌, సైబరాబాద్‌ సీపీ అవినాష్‌ మహంతి, మేడ్చల్‌ జోన్‌ డీసీపీ కోటిరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడి నుంచి రాష్ట్రపతి నేరుగా భారీ కాన్వాయ్‌తో సికింద్రాబాద్‌ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంకు చేరుకున్నారు. ఈ నెల 21 వరకు ఐదు రోజుల పాటు అక్కడే ఉండి వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

Updated Date - Dec 18 , 2024 | 06:23 AM