Police Akka : ‘పోలీస్ అక్క’లు వస్తున్నారు!
ABN, Publish Date - Dec 18 , 2024 | 04:35 AM
మహిళల రక్షణకు రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు ‘పోలీస్ అక్క’ పేరిట వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పద్మనాయక కల్యాణ మండపంలో షీటీమ్ ఆధ్వర్యంలో చేపట్టిన ‘పోలీస్ అక్క’ కార్యక్రమాన్ని ఎస్పీ అఖిల్ మహాజన్
రాజన్న సిరిసిల్ల జిల్లాలో వినూత్న కార్యక్రమం
సిరిసిల్ల, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): మహిళల రక్షణకు రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు ‘పోలీస్ అక్క’ పేరిట వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పద్మనాయక కల్యాణ మండపంలో షీటీమ్ ఆధ్వర్యంలో చేపట్టిన ‘పోలీస్ అక్క’ కార్యక్రమాన్ని ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రారంభించారు. ఇందులో భాగంగా మహిళల రక్షణకు జిల్లా వ్యాప్తంగా ప్రతీ పోలీస్ స్టేషన్‌లో ఒక మహిళా కానిస్టేబుల్‌ను నియమించారు. పోలీస్ అక్కగా ఉండే ఆ కానిస్టేబుల్ పాఠశాలలు, కళాశాలలను సందర్శిస్తూ పోక్సో, లైంగిక వేధింపులు, ఈవ్‌టీజింగ్, గుడ్ టచ్.. బ్యాడ్ టచ్, మహిళా చట్టాలపై అవగాహన కల్పిస్తూ షీటీమ్‌కు సహాయంగా పని చేస్తారు. అత్యవసర సమయాల్లో డయల్ 100తోపాటు పోలీస్ అక్క ఫోన్ నంబరును సద్వినియోగం చేసుకోవాలని అవగాహన కల్పించనున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో ఆకతాయిల ఆట కట్టిస్తూ షీటీమ్ సత్ఫలితాలు సాధిస్తోందని, ఈ సంవత్సరం 52 మంది ఆకతాయిలను పట్టుకున్నదని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, సీఐ కృష్ణ పాల్గొన్నారు.
Updated Date - Dec 18 , 2024 | 04:35 AM