ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

దివ్యాంగులు నిరుత్సాహపడొద్దు

ABN, Publish Date - Nov 21 , 2024 | 11:38 PM

స్తుత కాలంలో దివ్యాంగులమని నిరుత్సాహ పడవద్దని, వికల త్వమనేది శరీరానికే తప్ప మ నస్సుకు, ఆలోచనకు కాదని నిరూపించాలని కలెక్టర్‌ బదా వత్‌ సంతోష్‌ అన్నారు.

జెండా ఊపి క్రీడలను ప్రారంభిస్తున్న కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌

- కలెక్టర్‌ సంతోష్‌

నాగర్‌కర్నూల్‌, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి) : ప్రస్తుత కాలంలో దివ్యాంగులమని నిరుత్సాహ పడవద్దని, వికల త్వమనేది శరీరానికే తప్ప మ నస్సుకు, ఆలోచనకు కాదని నిరూపించాలని కలెక్టర్‌ బదా వత్‌ సంతోష్‌ అన్నారు. డిసెం బరు 3న ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకుని గురువారం జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో విభిన్న ప్రతిభావంతుల క్రీడాపోటీలకు కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు. డీడబ్ల్యూవో రాజేశ్వరి, సంబంధిత అధికారులు దివ్యాంగులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ట్రైసైకిల్‌ పరు గు, చెస్‌, క్యారమ్‌, షార్ట్‌ ఫుట్‌, ఆటల పోటీలు నిర్వహించగా కలెక్టర్‌ దివ్యాంగులను ఉత్సా హపరిచేందుకు షార్ట్‌ఫుట్‌ క్రీడాపోటీల్లో కలెక్టర్‌ సైతం పాల్గొన్నారు. కలెక్టర్‌ మాట్లాడు తూ దివ్యాంగులు ఇతరులకు ఏ విధంగా కూడా తీసిపోకుండా తమ శక్తిసామర్థ్యాలను ప్రదర్శిస్తున్నారని అన్నారు. క్రీడల్లో గెలుపొం దిన క్రీడాకారులకు పాల్గొన్న వారందరికీ డిసెంబరు 3న జరిగే ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ కార్యక్రమంలో బహుమతులు ఇవ్వ నున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సం క్షేమ శాఖ అధికారి రాజేశ్వరి, వ్యాయామ ఉపాధ్యాయులు సుభాషిని, జిల్లా దివ్యాంగుల సంఘం సభ్యులు, దివ్యాంగులైన క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 21 , 2024 | 11:38 PM