ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

పాడి రైతులకు పాల బిల్లులు చెల్లించండి

ABN, Publish Date - Apr 03 , 2024 | 02:48 AM

రాష్ట్రంలోని పాడి రైతులకు 45 రోజులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న రూ.80 కోట్ల పాల బిల్లులను తక్షణం చెల్లించాలని

సీఎం రేవంత్‌రెడ్డికి హరీశ్‌ రావు లేఖ

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పాడి రైతులకు 45 రోజులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న రూ.80 కోట్ల పాల బిల్లులను తక్షణం చెల్లించాలని సీఎం రేవంత్‌రెడ్డిని మాజీ మంత్రి హరీశ్‌ రావు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన సీఎంకు లేఖ రాశారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల మందికి పైగా పాడి రైతులు పాల ఉత్పత్తి సహకార సంఘాలుగా ఏర్పడి, ప్రభుత్వం నడిపే విజయ డెయిరీకి ప్రతీ రోజు పాలు సరఫరా చేస్తున్నారన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బిల్లుల చెల్లింపు సకాలంలో జరగడంలేదన్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి బకాయిలు విడుదల చేయడంతో పాటు 15 రోజులకోసారి పాల బిల్లులు చెల్లించాలని హరీశ్‌ రావు డిమాండ్‌ చేశారు.

Updated Date - Apr 03 , 2024 | 08:21 AM

Advertising
Advertising