Gram Panchayat Staff : గ్రామపంచాయతీ సిబ్బంది బకాయి వేతనాలు చెల్ల్లించాలి
ABN, Publish Date - Dec 18 , 2024 | 06:46 AM
గ్రామ పంచాయతీ సిబ్బంది వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని, ప్రతే ్యక బడ్జెట్ కేటాయించి గ్రీన్ చానల్ ద్వారా వేతన చెల్లింపులు చేయాలని ప్రభుత్వాన్ని కార్మిక సంఘాల నేతలు
ధర్నా చౌక్ వద్ద ఉద్యోగ, కార్మిక సంఘాల మహాధర్నా
కవాడిగూడ, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీ సిబ్బంది వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని, ప్రతే ్యక బడ్జెట్ కేటాయించి గ్రీన్ చానల్ ద్వారా వేతన చెల్లింపులు చేయాలని ప్రభుత్వాన్ని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేశారు. జీవో నంబరు 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని, పీఎఫ్, ఈ్‌సఐ రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ లాంటి చట్టబద్ద సౌకర్యాలుకల్పించాలన్నారు. ఈ మేరకు తెలంగాణ గ్రామపంచాయితీ ఉద్యోగ కార్మిక సంఘాల జేఏసీ, సీఐటీయూ, ఏఐటీయూసీ, టీయూసీఐ, ఎఫ్‌టీయూ తెలంగాణ గ్రామపంచాయతీ కారొబార్, బిల్‌కలెక్టర్ సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం ఇందిరాపార్కు వద్ద చలో హైదరాబాద్‌లో భాగంగా మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆ సంఘాల నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో 12,790 గ్రామ పంచాయతీల్లో సుమారు 60వేల మంది ఉద్యోగులు, కార్మికులు పనిచేస్తున్నారన్నారు. 2018లో గత ప్రభుత్వం జీవో 51ని విడుదల చేసి సిబ్బంది వేతనాలను రూ. 8500 పెంచుతూనే పంచాయతీ కార్మికుల మెడకు ఉరితాళ్లు బిగిస్తూ మల్టీప్పస్ వర్కర్ విధానాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ఈ జీవోను సవరించి మల్టీపర్పస్ వర్క ర్ విధానాన్ని రద్దు చేయాలని, కేటగిరీల వారీగా వేతనాలను పెంచాలని కారోబార్, బిల్ కలెక్టర్లకు స్పెషల్ స్టేటస్ కల్పించాలని కోరారు. పంచాయతీ సిబ్బందిని పర్మినెంట్ చేసి వేతనాలు పెంచాలని కోరారు. కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని లేని పక్షంలో రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉదృతం చేసి ప్రభుత్వాన్ని స్తంభింప చేస్తామని హెచ్చరించారు.
ధర్నాకు మొదట అనుమతిచ్చి ఆపై రద్దు చేసిన పోలీసులు
ఈ మహాధర్నాకు మొదట సెంట్రల్ జోన్ డీసీపీ అనుమతి ఇవ్వడంతో రాష్ట్రంలోని పంచాయతీ సిబ్బంది మంగళవారం ఉదయం ఇందిపార్కు ధర్నా చౌక్‌కు తరలివచ్చారు. అయితే సెంట్రల్‌జోన్ డీసీపీ ఇచ్చిన అనుమతిని సెంట్రల్ జోన్ అడిషనల్ డీసీపీ ఉన్నఫలంగా రద్దు చేసి మహాధర్నాకు వారిని వచ్చినట్లు అరెస్టు చేశారు. దాంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కార్మికులు పెద్దఎత్తున వేలాదిగా తరలిరావడంతో మధ్యాహ్నం 12 గంటల తరువాత ధర్నాకు పోలీసులు అవకాశం ఇచ్చారు.
Updated Date - Dec 18 , 2024 | 06:46 AM