ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మరింత మెరుగుపడాలి

ABN, Publish Date - Jan 18 , 2024 | 11:01 PM

పారిశుధ్య నిర్వహణ మరింత మెరుగు పడా ల్సిన అవసరం ఉందని అదనపు కలెక్టర్‌ శివేంద్రప్రతాప్‌ అన్నారు.

బండ్లగేరిలో పారిశుధ్యంపై అధికారులతో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌

- ఓపెన్‌ ప్లాట్లలో చెత్త, ప్లాస్టిక్‌ లేకుండా చర్యలు తీసుకోవాలి

- పలు కాలనీలను పరిశీలించిన అదనపు కలెక్టర్‌ శివేంద్రప్రతాప్‌

మహబూబ్‌నగర్‌, జనవరి 18 : పారిశుధ్య నిర్వహణ మరింత మెరుగు పడా ల్సిన అవసరం ఉందని అదనపు కలెక్టర్‌ శివేంద్రప్రతాప్‌ అన్నారు. డ్రైనేజీలలో మురుగుసరిగా తీయడం లేదని, ఎప్పటికప్పుడు మురుగుతీతపై దృష్టి సారించా లని కోరారు. గురువారం ఉదయం పట్టణంలోని బండ్లగేరి, రామ్‌నగర్‌, రవీంద్ర నగర్‌లో ఆయన పర్యటించి పారిశుధ్యంపై తీసుకుంటున్న చర్యలను పరిశీలిం చారు. పలు చోట్ల మురుగుకాలువల్లో మురుగు నిండిపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓపెన్‌ ప్లాట్‌లలో చెత్త, ప్లాస్టిక్‌ పారవేస్తున్నందున వాటిపై చర్య లు తీసుకోవాలని ఓపెన్‌ప్లాట్‌లను క్లీన్‌గా ఉంచాలని ఆదేశించారు. రోడ్లపై చెత్తా చెదారం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సిబ్బంది తక్కువగా ఉంటే వాటికి సంబంధించిన నివేదిక ఇవ్వాలని కోరారు. పారిశుధ్యంపై తీసుకుం టున్న చర్యలు బాగానే ఉన్నా మరింత మెరుగుపడాలని తెలిపారు. తడిపొడి చెత్త సేకరణ బాగా జరగాలని, సేకరించిన చెత్తను వేరుచేసే శాతం పెరగాలన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్‌ ప్రదీప్‌కుమార్‌, డీఈ బెంజిమెన్‌, ఏఈ వైష్ణవి, శానిటరి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jan 18 , 2024 | 11:01 PM

Advertising
Advertising