ప్రజల చెంతకే పాలన
ABN, Publish Date - Jan 27 , 2024 | 12:47 AM
ప్రజల చెంతకే ప్రభుత్వ యంత్రాంగం వెళ్లి అభయహస్తం ఆరు గ్యారంటీల పథకాలకు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించామని, ‘ప్రజాపాలన’ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించామని కలెక్టర్ హరిచందన అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రలోని పోలీస్‌పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన 75వ గణతంత్ర దినోత్సవంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఆమె మాట్లాడారు.
నూతన ప్రభుత్వంలో మానవీయ పథకాలు
కొలువుదీరిన రెండు రోజుల్లోనే రెండు గ్యారంటీల అమలు
డిసెంబరు నాటికి థర్మల్‌పవర్ ప్రాజెక్టు పనుల పూర్తి
గణతంత్ర దినోత్సవంలో కలెక్టర్ హరిచందన
నల్లగొండ, జనవరి 26: ప్రజల చెంతకే ప్రభుత్వ యంత్రాంగం వెళ్లి అభయహస్తం ఆరు గ్యారంటీల పథకాలకు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించామని, ‘ప్రజాపాలన’ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించామని కలెక్టర్ హరిచందన అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రలోని పోలీస్‌పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన 75వ గణతంత్ర దినోత్సవంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఆమె మాట్లాడారు. ఆరు గ్యారంటీల అమలుకు ప్రజల నుంచి 5,27,492 దరఖాస్తులను తీసుకొని, వాటి కంప్యూటరీకరణ పూర్తి చేశామన్నారు.
నూతన ప్రభుత్వం కొలువుదీరిన రెండు రోజుల్లోనే రెండు మానవీయ పథకాలను ప్రారంభించడం సంతోషమన్నారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించామన్నారు. డిసెంబరు 9న ఈ పథకం ప్రారంభం కాగా, ఇప్పటి వరకు 39,77,469 మంది ఉచిత ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకున్నారన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని రూ.5లక్షల నుంచి రూ.10లక్షలకు ప్రభుత్వం పెంచిందన్నారు. జిల్లాలో రైతులకు పంట పెట్టుబడి సహాయం కింద యాసంగి సీజన్‌లో 3,12,688మంది రైతులకు రూ.172.41కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. సాగర్ ప్రాజెక్టు ఎడమ కాల్వ ద్వారా 1.46లక్షల ఎకరాలకు, ఏఎమ్మార్పీ, ఎస్‌ఎల్‌బీసీ కాల్వ ద్వారా 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామన్నారు. ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకం ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు అందించే పనులు, డిండి ఎత్తిపోతల పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే 200 గ్రామాలకు, 61వేల ఎకరాలకు నీరు అందిస్తామన్నారు. జిల్లా కేంద్రంలో రూ.275కోట్లతో కొత్త మెడికల్ కళాశాల భవన నిర్మాణం పురోగతిలో ఉందని, రూ.23.75కోట్లతో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, నల్లగొండలో 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ మంజూరై పనులు జరుగుతున్నాయన్నారు. నకిరేకల్ కమ్యూనిటీ హెల్త్‌సెంటర్‌ను ఏరియా ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేసేందుకు రూ.32కోట్లతో పనులు జరుగుతున్నాయన్నారు. 100 పడకల ఏరియా ఆస్పత్రి, మిర్యాలగూడను 200 పడకల ఆసుపత్రిగా ఉన్నతీకరణకు రూ.14.60కోట్లు మంజూరయ్యాయన్నారు. దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద రూ.34,500కోట్లతో 4వేల మెగావాట్ల ఉత్పత్తి సామర్ధ్యంతో థర్మల్ పవర్ ప్లాంటు నిర్మాణ పనులు ఈ ఏడాది డిసెంబరు నాటికి ఐదు యూనిట్ల నిర్మాణం పూర్తవుతుందన్నారు. నల్లగొండ నుంచి ముషంపల్లి-కన్నెకల్ వయా ధర్మాపురం వరకు రూ.99.80కోట్లతో సింగల్ రోడ్డును డబుల్‌గా మార్చేందుకు నిధులు మంజూరయ్యాయన్నారు. రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణం, విస్తరణ పనులు రూ.292.71కోట్లతో జరుగుతున్నాయన్నారు. రూ.32.65 కోట్లతో దేవరకొండ, నిడమనూరులో కోర్టు భవనాలు, జడ్జి రెసిడెన్షియల్ క్వార్టర్స్, నల్లగొండలో ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్, మిర్యాలగూడలో ఇండోర్ స్టేడియం పనులు జరుగుతున్నాయన్నారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో రహదారులు, జంక్షన్లు, ఆర్చీలు, చెరువుల సుందరీకరణ, పార్కుల అభివృద్ధికి చర్యలు తీసుకున్నామన్నారు. నల్లగొండలో రూ.533.6కోట్లు, మిర్యాలగూడలో రూ.101.77కోట్లు, దేవరకొండలో రూ.56.20కోట్లు, చిట్యాలలో రూ.19కోట్లు, నందికొండలో రూ.28,85 కోట్లు, నకిరేకల్‌లో రూ.31.75కోట్లు, హాలియాలో రూ.33.75కోట్లు, చండూరు మున్సిపాలిటీలో రూ.52.41కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. కార్యక్రమంలో ఎస్పీ చందన దీప్తి, జడ్పీ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కోటిరెడ్డి, నర్సిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. కాగా, గణతంత్ర వేడుకల సందర్భంగా వివిధ శాఖలు వాటి ప్రగతిని తెలియ చేస్తూ శకటాల ప్రదర్శన నిర్వహించాయి. అదేవిధంగా గణతంత్ర దినోత్సవ సందర్భంగా కలెక్టరేట్‌లో తేనేటి విందు నిర్వహించారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సీనియర్ సిటిజెన్స్‌ను కలెక్టర్ సన్మానించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్, అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, ఆర్డీవో రవి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చోల్లెటి ప్రభాకర్, డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్, జిల్లా అధికారులు,తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jan 27 , 2024 | 12:47 AM