ఆర్‌ఆర్‌ఆర్ అలైన్‌మెంట్‌ను మార్చాలి
ABN, Publish Date - Feb 02 , 2024 | 12:06 AM
ఆర్‌ఆర్‌ఆర్ అలైన్‌మెంట్ మార్చేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మండలంలోని వర్కట్‌పల్లి, గోకారం గ్రామాల రీజనల్ రింగ్‌రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) బాధిత రైతులు కోదండరాంకు విన్నవించారు.
కోదండరాంకు బాధితుల వినతి
వలిగొండ, ఫిబ్రవరి 1: ఆర్‌ఆర్‌ఆర్ అలైన్‌మెంట్ మార్చేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మండలంలోని వర్కట్‌పల్లి, గోకారం గ్రామాల రీజనల్ రింగ్‌రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) బాధిత రైతులు కోదండరాంకు విన్నవించారు. గురువారం హైదరాబాద్‌లో ఆయన నివాసంలో కలిసి ఈ మేరకు విన్నవించారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ, గతంలో గ్యాస్‌లైన్, కాళేశ్వరం కాల్వలు, గౌరెల్లి-ఖమ్మం రోడ్డులో తాము భూములు కోల్పోయామని, తిరిగి ఆర్‌ఆర్‌ఆర్‌కు తమ భూములనే ప్రభుత్వం తీసుకోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్‌ఆర్‌ఆర్ కారణంగా తాము జీవనాధారం కోల్పోవాల్సి వస్తుందని అన్నారు. అలైన్‌మెంట్‌ను మార్చేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు గుండు ధానయ్య, గోపి, వెంకటేశం, జనార్ధన్‌రెడ్డి, కిష్టయ్య, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Feb 02 , 2024 | 12:06 AM