ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

టీఎస్పీఎస్సీ కమిటీలో ఉమ్మడి జిల్లా వాసులు

ABN, Publish Date - Jan 25 , 2024 | 11:35 PM

ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఇరువురికి కీలక పదవులు లభించాయి. జాబ్‌క్యాలెండర్‌ నిర్వహణను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ మేరకు టీఎస్పీఎస్సీ కమిటీ సభ్యులుగా సూర్యాపేట జిల్లాకు చెందిన పాల్వాయి రజనీకుమారి, యాదాద్రిభువనగిరి జిల్లాకు చెందిన నర్రి యాదయ్యను ఎంపిక చేస్తూ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

పాల్వాయి రజనీకుమారి, నర్రి యాదయ్య

సభ్యులుగా రజనీకుమారి, యాదయ్య

సూర్యాపేట టౌన / సంస్థాననారా యణపురం, జనవరి 25 : ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఇరువురికి కీలక పదవులు లభించాయి. జాబ్‌క్యాలెండర్‌ నిర్వహణను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ మేరకు టీఎస్పీఎస్సీ కమిటీ సభ్యులుగా సూర్యాపేట జిల్లాకు చెందిన పాల్వాయి రజనీకుమారి, యాదాద్రిభువనగిరి జిల్లాకు చెందిన నర్రి యాదయ్యను ఎంపిక చేస్తూ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన రజనీకుమారి హైదరాబాద్‌ మునిసిపల్‌ కమిషనర్‌గా పనిచేశారు. 2004లో టీడీపీ తరుపున సూర్యాపేట అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం బీజేపీలో చేరారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ముందు రేవంతరెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆమె ఎంపికపై పట్టణవాసులు హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా యాదాద్రిభువనగిరి జిల్లా సంస్థాననారాయణపురం మండలం మల్లారెడ్డిగూడెం గ్రామానికి నర్రి యాదయ్య కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన జేఎన టీయూ రిజిస్టార్‌గా వ్యవహరిస్తున్నారు. దుర్గయ్య, మల్లమ్మల కుమారుడైన యాదయ్యది నిరుపేద కుటుంబం. పదో తరగతి వరకు సర్వేల్‌ ఉన్నత పాఠశాలలో, ఉస్మానియా నుంచి ఇంజనీరింగ్‌, ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఎంటెక్‌ చేశారు. వివిధ బాధ్యతలు నిర్వహించిన యాదయ్యకు ఎంపిక కావడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

Updated Date - Jan 25 , 2024 | 11:35 PM

Advertising
Advertising