అసంపూర్తి భవనాలకు మోక్షమెప్పుడో?
ABN, Publish Date - Jan 18 , 2024 | 12:24 AM
మండలంలో రెండు కమ్యూనిటీహాల్ భవనాల పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి.
నిధులలేమితో చేతులెత్తేసిన కాంట్రాక్టర్లు
ఏళ్లుగా ఎదురుచూస్తున్న ప్రజలు
తుర్కపల్లి, జనవరి 17: మండలంలో రెండు కమ్యూనిటీహాల్ భవనాల పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. ప్రభుత్వం అరకొర నిధులు మం జూరు చేయడంతో భవన నిర్మాణం పనులు మధ్య లో నిలిచి పోయినట్లు పలువురు పేర్కొంటున్నా రు. సుమారు రూ.10లక్షల అంచనాతో మండలంలోని వేల్పుపల్లి, కోనాపూర్ గ్రామాల్లో ముదిరాజ్ కమ్యూనిటీ హాల్ భవనాలను నిర్మించేందుకు ప్రభుత్వం నుంచి 2018-19 సం వత్సరానికి ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి సీడీపీ నిధుల నుంచి ఒక్కో భవన నిర్మాణానికి రూ.4లక్షలు మంజూరు చేశారు. మండంలోని కోనాపూర్, వేల్పుపల్లిలో 2018 ఫిబ్రవరి 13న తాజా మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. రూ.4లక్షలతో ఈ నిర్మాణ పనులను కాం ట్రాక్టర్లు బేస్మెంట్, పెన్త బీములు, కాలాలు పూర్తి చేసి శ్లాబ్ వేశారు. చేసిన పనికి ఎం బీ రికార్డు కూడ చేశారు. మిగతా పనులు పూర్తి చేయడానికి నిధులు లేక పోవడంతో పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. ఈ భవనాలు పూర్తి చేయడానికి అదనపు నిధులు మంజూరు చేయాలని తాజా మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను ఎన్నోసార్లు కలిసినా నిధుల మంజూరుకు హామీ ఇచ్చారు కానీ నిధులు మాత్రం మంజూరు చేయలేదని తెలిపారు. మరో రూ.5లక్షల చొప్పున మంజూరు చేస్తే భవన నిర్మాణాలు పూర్తి అవుతాయని కాంట్రాక్టర్లు తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వంలోనైనా ఈ భవనాలు పూర్తి చేయడానికి నిధులు మంజూరు చేయాలని ఆయా గ్రామాల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
అదనపు నిధులు మంజూరు చేయాలి
గ్రామంలో ముదిరాజ్ కమ్యూనిటీ హాల్ భవన నిర్మ్ణాణానికి అప్పటి ప్రభుత్వం రూ.4లక్షలు మంజూరు చేసింది. ఈ నిధు లు సరి పోకపోవడంతో భవన నిర్మాణపనులు అసంపూర్తిగా నిలిచి పోయాయి. అదనపు నిధుల మంజూరు కోసం గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో అధికారులు, ప్రజా ప్రతినిధుల దృష్టికి ఎన్నో సార్లు తీసుకెళ్లినా నిధులు మంజూరు చేయలేదు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా ప్రజా ప్రతినిధులు స్పందించి అదనపు నిధులు మంజూరు చేసి, భవన నిర్మాణ పనులను పూర్తి చేయాలి.
- కొండయ్య, మత్స్యశాఖ చైర్మన, వేల్పుపల్లి
Updated Date - Jan 18 , 2024 | 12:24 AM