మద్యపాన నిషేధ గ్రామంగా గట్టికల్
ABN, Publish Date - Oct 15 , 2024 | 12:42 AM
దశాబ్దకాలంగా సమస్యాత్మక గ్రామంగా అధికారుల రికార్డుల్లో ఉన్న గట్టికల్ గ్రామం మద్యపాన నిషేధ గ్రామంగా సోమవారం మారింది.
ఆత్మకూరు(ఎస్), అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): దశాబ్దకాలంగా సమస్యాత్మక గ్రామంగా అధికారుల రికార్డుల్లో ఉన్న గట్టికల్ గ్రామం మద్యపాన నిషేధ గ్రామంగా సోమవారం మారింది. అన్ని రాజకీయపార్టీలు, యువజన సంఘాలు, మహిళా సంఘాల ఆధ్వర్యంలో గాంధీ జయంతి సందర్భంగా ఈ నెల 2వ తేదీన నిర్ణయించిన మద్యపాన నిషేధ నిర్ణయం సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. మద్యం మహమ్మారితో ఎన్నో కుటుంబాలు దెబ్బతినడంతో ఊరంతా ఏకతాటిపైకి వచ్చి మద్యనిషేధానికి సిద్ధమైంది. 12 రోజుల్లో అధికారుల సహకారంతో మద్యపాన నిషేధ గ్రామంగా రూపుదిద్దుకునేందుకు అడుగు వేసింది. గ్రామంలో మద్యం విక్రయించినా, తాగినా రూ.25వేలు జరిమానా, మద్యం విక్రయాల సమాచారం ఇచ్చిన వారికి రూ.2,500 ఇవ్వాలని తీర్మానించారు. గ్రామస్థులను ఏఎ్‌సఐ శంకర్‌నాయక్ అభినందిం చారు. ఉద్యమానికి సహకరించిన కలెక్టర్, జిల్లా అధికారులకు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.
Updated Date - Oct 15 , 2024 | 12:42 AM