ఎనిమిది తరగతులు.. ఇద్దరే ఉపాధ్యాయులు
ABN, Publish Date - Sep 21 , 2024 | 12:31 AM
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు విద్య అందని ద్రాక్షగా మారింది. ప్రాఽథమిక, ప్రాఽథమికోన్నత పాఠశాలల్లో సరిపడా ఉపాధ్యాయులు లేక మండలంలో విద్యార్థులు నాణ్యమైన విద్యను కోల్పోతున్నారు.
విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన
ఆత్మకూరు(ఎం) సెప్టెంబర్ 12: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు విద్య అందని ద్రాక్షగా మారింది. ప్రాఽథమిక, ప్రాఽథమికోన్నత పాఠశాలల్లో సరిపడా ఉపాధ్యాయులు లేక మండలంలో విద్యార్థులు నాణ్యమైన విద్యను కోల్పోతున్నారు. ఒక పాఠశాలలో ఎనిమిది తరగతులకు ఇద్దరు ఉపాధ్యాయులు పనిచేస్తుండగా, పన్నెండు ఏకోపాధ్యాయ పాఠశాలలు నడుస్తున్నాయి. అదీకాక 16 మంది ఉపాధ్యాయులు 3 నెలల క్రితం బదిలీ అయినప్పటికీ ఇక్కడే పనిచేస్తున్నారు. మండలంలో 15 ప్రాథమిక, 3 ప్రాఽథమికోన్నత, ఆరు ఉన్నత, ఒక కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలలు ఉన్నాయి. రాయిపల్లి ప్రాథమిక పాఠశాలలో ఆరుగురు, సర్వేపల్లిలో-20, సింగారంలో-19, కొరటికల్-22, పల్లెపహడ్-13, ఉప్పలపహడ్-7, టి,రేపాక-5, కప్రాయిపెల్లి -28, రహీంఖానపేట -6, తుక్కాపురం 15, కూరెళ్ల -44, రాఘవపురం -12పల్లెర్ల ఎస్సీ కాలనీ -11, పల్లెర్ల-34, ఆత్మకూరు-76, మొరిపిరాల (యుపీఎస్) 53, పారుపల్లి-22, పోతిరెడ్డిపల్లి- 7 గురు చొప్పున విద్యార్థులు ఉన్నారు. మొరిపిరాల పాఠశాలలో 1 నుంచి 8 తరగతులు ఉన్నాయి. ఇందులో 53 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ పాఠశాలలో ఆరుగురు ఉపాధ్యాయులకు ముగ్గురు మాత్రమె పనిచేస్తున్నారు. అందులో ప్రధానోపాఽధ్యాయుడు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లగా, ఎనమిది తరగతులకు ఇద్దరే ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తున్నారు. సరిపడా ఉపాధ్యాయులు లేక పిల్లలకు తీవ్ర నష్టం జరుగుతోందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండలంలో 12 ఏకోపాధ్యాయ పాఠశాలలు కొనసాగుతున్నాయి. వీరి లో ఏ ఒక్కరు పాఠశాలకు రాకపోయినా ఆ రోజు ఆ పాఠశాలకు సెలవే.
ప్రైవేటు పాఠశాలల వైపు మొగ్గు
ఇప్పటికే ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. ఇలాగే పాఠశాలల పరిస్థితి కొనసాగితే ఉన్న విద్యార్థులు సైతం ప్రైవేటు వైపు మొగ్గు చూపే ప్రమాదం ఉందంటున్నారు మం డల ప్రజలు. ప్రభుత్వం ఇటీవల ఎస్‌జీటీలను ప్ర మోషన్లు ఇవ్వడంతో చాలా మంది ఉపాధ్యాయులు ఇతర పాఠశాలకు బదిలీలపై వెళ్లారు. అందులో 16 మందికి వారి స్థానంలో మరొకరు రాకపోవడంతో గత 3 నెలలుగా తిరిగి మండలంలోనె యథాస్థానంలో విధులు నిర్వహిస్తున్నారు. ఉన్న కొద్ది మంది ఉపాధ్యాయుల్లో కొందరు దీర్ఘకాలిక సెలవులపై వెళ్లినట్టు తెలిసింది. బదిలీల్లో ఉపాధ్యాయులు పట్టణ పరిసర ప్రాంతాలకు వెళుతూ, గ్రామీణ ప్రాంత పాఠశాలలకు రావడానికి సుముఖత చూపడంలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి పటిష్టమైన విద్యావిధానాన్ని అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
ఈ విషయంపై ఎంఈవో శ్రీధర్‌ను వివరణ కోరగా ప్రస్తుతం ఉన్న ఉపాధ్యాయులతోనే ఖాళీలను సర్దుబాటు చేస్తామని తెలిపారు. నూతన నియామకాలు జరిగితేనే సమస్య పరిష్కారం అవుతుందని పేర్కొన్నారు.
Updated Date - Sep 21 , 2024 | 12:31 AM