ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

విభజన హామీల సాధనకు ఉద్యమం : టీజేఎస్‌

ABN, Publish Date - Jan 18 , 2024 | 12:07 AM

రాష్ట్ర విభజన హామీల సాధనకు ఉద్యమాన్ని తీవ్ర తరం చేస్తామని తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షుడు పన్నాల గోపాల్‌రెడ్డి తెలిపారు.

పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న టీజేఎస్‌ నాయకులు

నల్లగొండ టౌన్‌, జనవరి 17: రాష్ట్ర విభజన హామీల సాధనకు ఉద్యమాన్ని తీవ్ర తరం చేస్తామని తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షుడు పన్నాల గోపాల్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో ఈ నెల 21వ తేదీన నిర్వహించనున్న రాష్ట్ర సదస్సు పోస్టర్లను పార్టీ కార్యాల యంలో బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణాజలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటా తేల్చా లని కోరారు. ఉద్యోగుల విభజన పూర్తి చేయాలన్నారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, ఇతర మంత్రులకు వినతిపత్రాలు అందజేసినా పది సంవత్సరాల నుంచి పట్టించుకోవడం లేదన్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో టీజేఎస్‌ జిల్లా కార్యదర్శి పులి పాపయ్య, నాయకులు నూకల మల్లేష్‌, వై. పాపిరెడ్డి, ధీరావత్‌ వీరనాయక్‌, కర్నేకంటి కిరణ్‌, పల్లె రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 18 , 2024 | 12:07 AM

Advertising
Advertising